భూదందాలో లక్ష కోట్ల రూ కుంభకోణం ...ఒక మంత్రి ప్రమేయం !

Posted 9 months ago | Category : state politics

మియాపూర్ ప్రాంతంలో వెలుగు లోకి వచ్చిన భూ దందా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రభుత్వం మెడకు చుట్టుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వం చెబుతున్నట్లు కేవలం  693 ఎకరాలకు సంబంధించిన, ప్రభుత్వ ఆదాయానికి రూ 587 కోట్ల మేరకు గండి పడిన కుంభకోణం మాత్రమే కాదని, వేల కొలది కోట్ల రూపాయల కుంభకోణం అని విమర్శలు చెలరేగుతున్నాయి. 

ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించిన తీరు మరిన్ని అనుమానాలకు దారి తీస్తున్నదని, ఒక సాధారణ సబ్‌రిజిస్ట్రార్ సొంతగా ఇటువంటి భారీ కుంభకోణానికి పాల్పడే అవకాశం లేదని కూడా భావిస్తున్నారు. ప్రభుత్వంలోని పెద్దల ప్రమేయం ఉన్నట్లు స్పష్టం కావడంతో సిఐడి దర్యాప్తు కేవలం నిందితులను కాపాడటం కోసమే దారి తీసే అవకాశం ఉంది. సి బి ఐ దర్యాప్తుకు ఆదేశించాలని ఢిమాండ్లు చెలరేగుతున్నాయి. 

ఇది మొత్తం లక్ష కోట్ల రూపాయల కుంభకోణం అని మాజీ మంత్రి, సీనియర్ బిజెపి నాయకుడు డా. నాగం జనార్ధన రెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ మంత్రివర్గంలోని ఓ సీనియర్‌ మంత్రికి ఈ కుంభకోణంతో ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. విచ్చల విడిగా దోపిడీకి పాల్పడేందుకు ముందుగా ఆ మంత్రి కి రెండెకరాల భూమిని, ఆయన చెప్పిన బినామికి, వారే రిజిస్ట్రేషన్ ఖర్చులు జరిపించి, మంత్రిగారి పేషీ లోని ఇద్దరితో సాక్షి సంతకాలు చేయించి రిజిస్ట్రేషన్ చేసిన్నల్టు వెలుగులోకి వచ్చింది. 

ఈ విధంగా పలుకుబడి గల మరి అనేకమంది ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్నట్లు భావించే ఒక ప్రముఖ స్థిరాస్తి సంస్థ దర్శకత్వంలోనే మొత్తం భూదందా జరిగిన్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ విషయంలో అధికారులు మౌనం వహిస్తున్నారు. 

మరో వంక, ఈ కుంభకోణం బయట పడిన తరువాత హడావుడిగా జరిపిన అధికారుల బదిలీల్లో భారీఎత్తున అక్రమాలు జరిగిన్నట్లు తెలుస్తున్నది. ఏకంగా ఏసీబీ కేసులు ఉన్నవారికి కీలక చోట్లలో పోస్టింగ్‌లు ఇచ్చేశారు. రాత్రికిరాత్రే జరిగిన ఈ బదిలీల్లో భారీగా ముడుపులు చేతులు మారినట్లు కనబడుతుంది. మొత్తంగా బదిలీలన్నీ తూతూమంత్రంగానే జరిగినట్లుగా తెలుస్తోంది. ఎక్కువమందిని హైదరాబాద్ పరిధికే పరిమితం చేశారు. మరికొంతమందిని పక్కపక్క జిల్లాలకే బదిలీలు చేశారు. 


వీడియో కాల్ తో సూసైడ్ చేసుకున్న యువతీ..!

Posted 4 hours ago | Category : state

వీడియో కాల్ తో సూసైడ్ చేసుకున్న యువతీ..!

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

విశాఖలో దారుణం...హత్యకు గురైన వి ఆర్ ఐ......!

Posted 6 hours ago | Category : state

విశాఖలో దారుణం...హత్యకు గురైన వి ఆర్ ఐ......!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

సికింద్రాబాద్‌లో నిర్భయ తరహా ఘటన..!

Posted 10 hours ago | Category : state

సికింద్రాబాద్‌లో నిర్భయ తరహా ఘటన..!

ఒంటిమిట్ట చెరువులో మృతదేహాలు..!

Posted 11 hours ago | Category : state

ఒంటిమిట్ట చెరువులో మృతదేహాలు..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

మద్యం మత్తులో హిజ్రా ఎంచేసిందో తెలుసా...!

Posted 14 hours ago | Category : state

మద్యం మత్తులో హిజ్రా ఎంచేసిందో తెలుసా...!

కేపీహెచ్‌బీ చట్నీస్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం..!

Posted 15 hours ago | Category : state

కేపీహెచ్‌బీ చట్నీస్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం..!

నేడు ఆమ్రపాలి వివాహం..!

Posted 16 hours ago | Category : state

నేడు ఆమ్రపాలి వివాహం..!

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

Posted a day ago | Category : state

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!