ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

రేవంత్ కి ఎల్.రమణ సవాల్ : మోత్కుపల్లి ఆగ్రహం

Posted a month ago politics

తనపై కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎల్ రమణ ఘాటుగా స్పందించారు.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తాను ఉపాధి కూలీని అంటూ తనపై రేవంత్ ఆరోపణలు చేశారని, అదేమిటో చెప్పాలని రమణ నిలదీశారు. దేనికి ఉపాధి కూలీగా ఉన్నానో చెప్పాలని అడిగారు. రేవంత్‌కు ఎల్ రమణ సవాల్ తనపై ఆరోపణలు చేసిన రేవంత్‌కు తాను ఓ సవాల్ విసురుతున్నానని రమణ అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను సంపాదించినది, ఆయన సంపాదించినది పేదలకు ఇచ్చేందుకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.

తనకు 1994లో ఎమ్మెల్యే కాకముందు ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ఇప్పటికీ అవే ఉన్నాయని, ఎవరైనా తనకు సాయం చేసేందుకు ముందుకు వస్తే ఆ మొత్తం పేదలకు, సన్నిహితులకు అందేలా చూశానని రమణ చెప్పారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని రేవంత్ రెడ్డిని చేర్చుకోవడం ద్వారా రాహుల్ గాంధీ ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని రమణ నిలదీశారు. కాగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన 200 మంది యువకులు సోమవారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

తాను ఎంతో నీతిమంతుడిని అని, తాను రాజీనామా చేశానని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, మరి ఆ రాజీనామా ఎవరికి ఇచ్చారో చెప్పాలని మరో తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు.

Related Articles

Most Read