//single page style gallary page

కాంగ్రెస్‌పై కేటీఆర్ షాకింగ్ కామెంట్!

Posted 7 months ago | Category : politics

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, ఐటీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్‌పై రెచ్చిపోయారు. తనదైన శైలిలో కామెంట్లు కుమ్మరించారు. ప్రస్తుతం జరుగుతున్న తెలగాణ అసెంబ్లీ వ్యవహారాలను ప్రస్తావించిన ఆయన కాంగ్రెస్ చర్యలను తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. హస్తం పార్టీ నేతలు చర్చ కన్నా రచ్చకే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేపట్టిన చలో అసెంబ్లీపై విరుచుకుపడ్డారు. తాము ప్రభుత్వం పరంగా అన్ని విషయాలనూ చర్చించేందుకు రెడీ ఉన్నామని చెప్పిన కేటీఆర్‌.. ఆయా విషయాలపై చర్చల నుంచి కాంగ్రెస్ పారిపోతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నేతలు చలో అసెంబ్లీ అన్నారని.. మేమూ వచ్చామని కేటీఆర్‌ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ నేతలు 20 రోజులు సభ నడపాలన్నారని.. మేము 50 రోజులు నడుపుతున్నామని చెప్పారు. వారు కోరితే సమావేశాలు ఇంకా పొడిగిస్తామన్నారు. మేము చర్చకు సిద్ధమైతే.. వారు రచ్చకు సిద్ధమయ్యారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. శీతాకాల సమావేశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామని వివరించారు. ఎన్ని రోజులైనా సభ నడిపేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కానీ, సుదీర్ఘ అనుభవం సొంతమని చెబుతున్న కాంగ్రెస్ నేతలు రోడ్లపై మాట్లాడుతున్నారు తప్ప.. సభలో మాట్లాడేందుకు మాత్రం సబ్జెక్టు లేక ఇబ్బంది పడుతున్నారంటూ కామెంట్లు కుమ్మరించారు.

బంగారు తెలంగాణ సాకారం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, ప్రభుత్వం కూడా ఆ నేపథ్యంలోనే అనేక సామాజిక, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతోందని చెప్పారు. ఇప్పటికే పేదలను దృష్టిలో పెట్టుకని గొర్రెల పంపిణీ వంటి కార్యక్రమాలను చేపట్టామని, రైతులకు లబ్ధి చేకూరేలా మిషన్ కాకతీయ, భగీరథ వంటి నీటి పారుదల ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించామని చెప్పారు. కేంద్రం నుంచి సాయం కోసం కూడా ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. మొత్తంగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే.. కాంగ్రెస్ సీనియర్లు దీనికి తమ సలహాలు, సూచనలు ఇవ్వడం మానేసి.. చలో అసెంబ్లీ వంటి కార్యక్రమాలకు పిలుపు నివ్వడం ద్వారా ఏం సాధిస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేపట్టేందుకు రెడీగా ఉందని చెప్పారు. బతుకమ్మ చీరలను తగలబెట్టిన వారిపై క్రిమినల్ చర్యలు తప్పవని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.


రంగంలోకి కుమారస్వామి భార్య

Posted 32 minutes ago | Category : national politics

రంగంలోకి కుమారస్వామి భార్య

ఇలా అయితే.. ప్ర‌పంచ బ్యాంక్‌కు క‌న్నం వేయాల్సిందే..!!

Posted an hour ago | Category : politics

ఇలా అయితే.. ప్ర‌పంచ బ్యాంక్‌కు క‌న్నం వేయాల్సిందే..!!

ప‌వ‌న్ యాత్ర‌.. పూన‌కంతో నాలుగు సినిమా డైలాలుగు .. వెయిటింగ్ ఫ‌ర్ టీడీపీ రియాక్ష‌న్‌..?

Posted 3 hours ago | Category : politics

 ప‌వ‌న్ యాత్ర‌.. పూన‌కంతో నాలుగు సినిమా డైలాలుగు .. వెయిటింగ్ ఫ‌ర్ టీడీపీ రియాక్ష‌న్‌..?

చంద్ర‌బాబు ఎంట్రీ.. దేశ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం..!!

Posted 3 hours ago | Category : politics

చంద్ర‌బాబు ఎంట్రీ.. దేశ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం..!!

ప‌వ‌న్‌పై శ్రీ‌రెడ్డి డైరెక్ట్ అటాక్‌..!!

Posted 3 hours ago | Category : politics movies

ప‌వ‌న్‌పై శ్రీ‌రెడ్డి డైరెక్ట్ అటాక్‌..!!

ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!!

Posted 3 hours ago | Category : politics

ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!!

వైఎస్ జగన్ మైక్ రికార్డ్స్.. బ్రేక్ చేస్తున్న పవన్ క‌ళ్యాణ్..!

Posted 19 hours ago | Category : politics

వైఎస్ జగన్ మైక్ రికార్డ్స్.. బ్రేక్ చేస్తున్న పవన్ క‌ళ్యాణ్..!

కుమారస్వామిని భయపెడుతున్న ఇల్లు

Posted 19 hours ago | Category : politics national

కుమారస్వామిని భయపెడుతున్న ఇల్లు

జగన్ పార్టీకి షాక్

Posted 19 hours ago | Category : state politics

జగన్ పార్టీకి షాక్

మోదీ దాచిపెట్టిన రహస్యం.. బ‌య‌ట‌ప‌డిన భారీ కుట్ర‌..!

Posted 21 hours ago | Category : politics

మోదీ దాచిపెట్టిన రహస్యం.. బ‌య‌ట‌ప‌డిన భారీ కుట్ర‌..!

2019లో బీజేపీ ఘోర ఓట‌మి..!!

Posted 21 hours ago | Category : politics

2019లో బీజేపీ ఘోర ఓట‌మి..!!