ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ఒంగోలు టిడిపి సమావేశంలో కరణం - గొట్టిపాటి బాహాబాహీ

Posted 7 months ago state politics

అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొట్టిపాటి  రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాంల మధ్య కొంతకాలంగా జరుగుతున్న ఆధిపత్య పోరు నేడు పరస్పరం బాహాబాహీ అంటూ చొక్కాలు పట్టుకొనే స్థాయికి చేరుకొంది. నాలుగు  రోజుల క్రితం బలరాం వర్గానికి చెందిన ఇద్దరినీ రవి కుమార్ వర్గానికి చెందినవారు హత్యా చేయడంతో పతాక స్థాయికి చేరిన  వర్గ పోరు నేడు జిల్లా  తెలుగు దేశం  పార్టీ సమావేశంలోనే పరస్పరం నేరుగా తలపడే వరకు దారితీసింది. 

జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు జరిగిన సమావేశానికి వస్తున్న రవికుమార్ ను కరణం వర్గీయులు అడ్డుకోవడంతో ఆ ప్రాంగణం అంతా రణరంగాన్ని తలపించింది. గొట్టిపాటి, కరణం పరస్పరం నేరుగా దాడులకు దిగేవరకు దారితీసింది. వర్గాలు ఘర్షణలకు దిగడం పలుచోట్ల జరిగినా నేరుగా నాయకులే తలపడటం బహుశా ఇదే ప్రధమం. 

ఈ పరిణామాలకు ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన మంత్రులు పి నారాయణ, పరిటాల సునీత, జిల్లా మంత్రి సిద్దా రాఘవరావు  దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ  పరిణామం అధికార పక్షంలో తీవ్ర కలవరానికి దారితీసింది. కరణం వర్గీయులు గొట్టిపాటి చొక్కా పట్టుకుని లాగడంతో గొడవ ప్రారంభమైంది. 

గొట్టిపాటి గన్‌మెన్‌ తమను తోసివేశారంటూ బలరాం వర్గీయులు ఆరోపించారు. తెదేపా కార్యకర్తలను హత్య చేసిన వారిని ఎలా రానిస్తారంటూ కరణం అనుచరులు నినాదాలు చేశారు. దీంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది.  తన చొక్కా చించడంతో గొట్టిపాటి ఎదురుతిరిగారు. 

కరణం స్వయంగా రంగంలోకి దిగడంతో పరస్పరం చొక్కాలు పట్టుకుని తలపడ్డారు. ఈ క్రమంలో గొట్టిపాటి రవికుమార్‌ కింద పడిపోయారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిద్దరినీ విడదీశారు. బందోబస్తు మధ్య గొట్టిపాటిని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు.

ఇరువర్గాల తోపులాటలు, అరుపులతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. 
గొట్టిపాటి వర్గీయులే తమను రెచ్చగొట్టారని కరణం బలరాం ఆరోపించారు. ఎవరినీ రెచ్చగొట్టాల్సిన అవసరం తమకు లేదని అంటూ బలరాం తన పని తాను చూసుకోవాలని గొట్టిపాటి హితవు పలికారు. మరోవైపు గొట్టిపాటి రవికుమార్‌ సాయంత్రం ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడును కలసి కరణం వర్గీయుల దాడిపై  ఫిర్యాదు చేయదానికి సిద్దపడుతున్నారు. 

Related Articles

Most Read