ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ఢిల్లీ సియం పదవిపై కిరణ్ బేడీ కన్ను !

Posted 6 months ago politics


దేశంలో ఒక మూల ఉన్న కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి లిఫ్టనెంట్ గోవర్నర్ గా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ అకస్మాత్తుగా క్రియాశీలకంగా మారడం, రాజకీయ నాయకురాలి వలే నేరుగా ప్రజలను కలవడం, పర్యటనలు జరపడం, అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఉండటం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తున్నది.

పైగా ఆమె చేసున్న ప్రతి చర్య గురించి ఢిల్లీ లో మీడియా ద్రుష్టి ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఢిల్లీ లో బిజెపి కి ఆమె విజయం తేలేక పోయినా తాను క్రియాశీల రాజకీయ పాత్ర వహించగలనని బిజెపి అధినాయకత్వానికి తెలియ చెప్పడమే ఆమె లక్ష్యంగా కనిపిస్తున్నది. ఢిల్లీ లో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయి తాజాగా ఎన్నికలు జరగవచ్చనే అంచనాతో, తిరిగి ఢిల్లీ ముఖ్యమంత్రిగా రంగ ప్రవేశం చేయడం కోసం కిరణ్ బేడీ వ్యూహాత్మకగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. 

దానితో స్థానిక కాంగ్రెస్ ముఖ్యమంత్రి వి నారాయణస్వామి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖేర్జీ, కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లను కలసి తనను అసలు ఆమె పనిచేయనీయడం లేదని, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ఫైల్స్ ను వెనుకకు పంపివేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తాను సమస్యను పరిష్కరిస్తానని రాజ్ నాథ్ హామీ ఇచ్చారని తెలిసింది.

ప్రధాని నరేంద్ర మోడీ ని కూడా కలవడానికి ఆయన  ప్రయత్నం చేస్తున్నారు.  తమకు తెలియకుండా తమ నియోజకవర్గాలలో ఆమె పర్యటనలు జరపడం పట్ల యం ఎల్ ఏ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేమని అంటే తాను `రబ్బర్ స్టాంప్' కాదని ఆమె అంటున్నారు. దైనందిన పాలనా వ్యవహారాలు ఎన్నికైన ప్రభుత్వ బాధ్యత అని, ప్రభుత్వాన్ని పనిచేయనీయాలని ముఖ్యమంత్రి కోరుతున్నారు. 

Related Articles

Most Read