//single page style gallary page

తెలంగాణ కు లక్ష కోట్లు ఇచ్చామన్న అమిత్ షా పై కేసీఆర్ ఫైర్

Posted a year ago | Category : state politics

మూడేళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ కు లక్ష కోట్లు ఇచ్చిందని బిజెపి జాతీయ అధ్యక్షుడు రాష్ట్రంలో మూడు రోజుల పర్యటన సందర్భంగా చెప్పడం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాష్ట్రానికి హక్కు ప్రకారం రావల్సిన ప్రతి రూపాయి కలిపితే నేటి వరకు వచ్చినది రూ. 67,390 కోట్లు మాత్రమేనని ఆయన స్పష్టం చేసారు. పైగా ఈ నిధులు మిగ‌తా రాష్ట్రాలకు  మాదిరిగానే రాజ్యాంగ బ‌ద్ధంగా రావ‌లిసిన నిధులని, అమిత్‌షా మ‌న‌కు మెహ‌ర్బానీ ఏమీ ఇవ్వ‌లేద‌ని ఆయన అవహేళన చేశారు. 

అంతకన్నా ఎక్కువ నిధులు ఇచ్చామని చూపితే తాను పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేసారు. పైగా రూ.లక్ష కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని దేశం కోసం తెలంగాణ అందిస్తున్నదని ముఖ్యమంత్రి  తెలిపారు. హైదరాబాద్ నుంచి రూ.లక్ష కోట్ల సాప్ట్‌వేర్ ఎగుమతులు జరుగుతున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ స‌మాజాన్ని అవ‌మాన‌ప‌రిచే విధంగా షా మాట్లాడారని విమర్శించారు. 

ఏపీ పునర్విభజన చట్టం షెడ్యూల్ 13 కింద ట్రైబల్, హార్టీ కల్చర్, వెటర్నరీ యూనివర్సిటీ మంజూరైనయి. అమిత్ షా చెప్పినట్లు ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడున్నదని సీఎం ప్రశ్నించారు. మూడు యూనివర్సిటీల ఏర్పాటుకు రూ.40,800 కోట్లు ఇచ్చినమని చెప్పడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తూ ఇవన్నీ ఎటుపోయినయో చెప్పాలని కోరారు. 

 అధికార పార్టీ అధ్య‌క్షుడై ఉండి ప‌చ్చి అబ‌ద్దాలు మాట్లాడార‌ని కేసీఆర్ విరుచుకు పడ్డారు. రాష్ట్రానికి పెన్ష‌న్లు ఇచ్చేగ‌తి లేద‌ని మాట్లాడిన అమిత్‌షా మ‌తి ఉండి మాట్లాడుతున్న‌డో, లేక మ‌తిలేక మాట్లాడుతున్న‌డో తెల‌య‌ద‌అని ఆగ్రహం ప్రకటించారు. 
 అమిత్ షా నల్లగొండ జిల్లా పర్యటన సందర్భంగా తేరాట్‌పల్లి గ్రామంలో సహపంక్తిలో తిన్న  భోజనం దళితవాడల్లో వండిందికాదని కేసీఆర్ తెలిపారు.  కాగా ఈ భోజనం పక్కనే ఉన్న ఖమ్మంగూడెం గ్రామంలో మనోహర్‌రెడ్డి అనే వ్యక్తి వండించి పంపించిన భోజనం అని సీఎం తెలిపారు. 


హైదరాబాద్ లో నడిరోడ్డుపై గొడ్డలితో నరికి దారుణహత్య

Posted 5 hours ago | Category : state

 హైదరాబాద్ లో  నడిరోడ్డుపై గొడ్డలితో నరికి దారుణహత్య

దమ్ముంటే నాపై పోటీ కి దిగు .......పవన్ కి సవాల్ విసిరిన చింతమనేని .....

Posted 5 hours ago | Category : politics

 దమ్ముంటే నాపై పోటీ కి దిగు .......పవన్ కి సవాల్ విసిరిన చింతమనేని .....

జగన్ ని ఇంట్లో పడుకోమన్న సుప్రీం కోర్టు

Posted 7 hours ago | Category : politics

జగన్ ని ఇంట్లో పడుకోమన్న సుప్రీం కోర్టు

చెత్తకుండీ నుండి అసిస్టెంట్ కమిషనర్‌ గా...

Posted 7 hours ago | Category : state national

 చెత్తకుండీ నుండి అసిస్టెంట్ కమిషనర్‌ గా...

మావోయిస్టుల నెక్ట్స్ టార్గెట్.. ఆ ఎమ్మెల్యేనే..!

Posted 10 hours ago | Category : politics

మావోయిస్టుల నెక్ట్స్ టార్గెట్.. ఆ ఎమ్మెల్యేనే..!

బాబుకు షాక్ ఇచ్చిన హోంమంత్రి చినరాజప్ప ....!

Posted a day ago | Category : politics

 బాబుకు షాక్ ఇచ్చిన  హోంమంత్రి చినరాజప్ప ....!

లక్షలాది రైతు బిడ్డలకి అన్నం పెట్టిన అన్నపూర్ణకి 20 ఏళ్ళు.....

Posted a day ago | Category : politics

లక్షలాది రైతు బిడ్డలకి అన్నం పెట్టిన అన్నపూర్ణకి 20 ఏళ్ళు.....

పవన్ కళ్యాణ్ కి స్క్రిప్ట్ అందించే నాదుడుకరువయ్యాడా...

Posted a day ago | Category : politics

 పవన్ కళ్యాణ్ కి స్క్రిప్ట్ అందించే నాదుడుకరువయ్యాడా...

నారాయణ లో మరో విద్యార్థి మృతి

Posted a day ago | Category : state

నారాయణ లో  మరో విద్యార్థి మృతి

తిప్పరా మీసం.... చంద్రబాబు ని చూసి తెలుగోడా

Posted a day ago | Category : politics national

తిప్పరా మీసం.... చంద్రబాబు ని చూసి తెలుగోడా

ఐక్యరాజ్య సమితిలో బాబు మాట్లాడుతున్న రెండు అంశాలు ఇవే...

Posted a day ago | Category : politics state

 ఐక్యరాజ్య సమితిలో బాబు మాట్లాడుతున్న రెండు అంశాలు ఇవే...