ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

రేవంత్ కి హ్యాపీ బర్త్ డే చెప్పిన కేసీఆర్

Posted a month ago politics

సందు దొరికితే తనపై నిప్పులు కక్కే కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బర్త్ డే విషెస్ చెప్పారు.

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడిది హాట్ టాపిక్ అయ్యింది. రేవంత్ రెడ్డి పేరు చెబితేనే విరుచుకుపడే కేసీఆర్ బర్త్ డే విషెస్ చెబుతూ ఓ లేఖతోపాటు పుష్పగుచ్చాన్ని రేవంత్‌కు పంపారు. ‘‘దేవుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. ప్రజాసేవలో మీరు మరెన్నో ఏళ్లు కొనసాగాలి’’ అని లేఖలో పేర్కొన్నారు.

ఓటుకు నోటు కేసు తర్వాత టీఆర్ఎస్.. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరుకున్నాయి. సమయం చిక్కినప్పుడల్లా అటు టీఆర్ఎస్ నేతలు, ఇటు రేవంత్ రెడ్డి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునేవారు.

రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన సమయంలోనూ ‘ఇక ఆట మొదలైంది’ అని పరోక్షంగా టీఆర్ఎస్‌ను హెచ్చరించారు. అయితే ఇప్పుడు వీటన్నింటినీ మనసులో పెట్టుకోకుండా కేసీఆర్ బుధవారం రేవంత్‌కు బర్త్ డే శుభాకాంక్షలు చెబుతూ పుష్ప గుచ్చాన్ని పంపడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

Related Articles

Most Read