ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

డిలీట్ చేసిన ట్వీట్‌పై స్పందించిన జనసేన

Posted 2 months ago politics

జనసేన అధికారిక ట్విటర్ అకౌంట్ నుంచి పోస్టు అయిన ఒక ట్వీట్‌పై ఆ పార్టీ వివరణ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో జనసేన 175 సీట్లలోనూ పోటీ చేస్తుంది అనే అర్థాన్ని ధ్వనించిన ఆ ట్వీట్‌ను ఇప్పటికే డిలీట్ చేశారు. జనసేన అధికారిక ఖాతా నుంచే ట్వీట్ అయిన ఆ అంశం అప్పటికే మీడియాలో హల్చల్ చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఏపీలోని అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తుందని అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ఆ విషయాన్ని ప్రకటించారని టీవీ చానళ్లలో వచ్చాయి.

అయితే జనసేన వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేయడంతో వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. బలాన్ని బట్టి అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తాం, బలం లేకపోతే బలమున్న స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తాం అన్నట్టుగా ఉన్న ఆ ట్వీట్ ను పోస్ట్ చేయడమే చర్చనీయాంశం. అంతలోనే అది డిలీట్ కావడంతో వ్యవహారం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో జనసేన స్పందించింది. జనసేన పార్టీ సోషల్ మీడియా టీమ్ లోని ఒక వ్యక్తి పొరపాటున ఆ ట్వీట్ పెట్టాడు అని పేర్కొంది. అయితే సోషల్ మీడియా టీమ్ లోని ఒక వ్యక్తి పవన్ అభిప్రాయాన్ని తప్పుగా అర్థం చేసుకుని, ఆ ట్వీట్ పెట్టాడు అని జనసేన వివరణ ఇచ్చింది. అందుకే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసినట్టుగా ఆ పార్టీ పేర్కొంది.

Related Articles

Most Read