ఒక్క పూట సంపన్నుడు.....బెజోస్

Posted 7 months ago | Category : business

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్థ అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ అవతరించారు. కానీ ఆ స్థానం ఎంతసేపో నిలవలేదు. గురువారం ఉదయం అమెజాన్ షేరు 1.8 శాతం లాభపడి 1065.92 డాలర్లు చేరింది. ఫలితంగా అమెజాన్‌లో 17 శాతం వాటా కలిగిన జెఫ్‌ బెజోస్‌ సంపద విలువ 90.9 బిలియన్‌ డాలర్లకు చేరింది. దీంతో మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ (90.7 బిలియన్ డాలర్లు)‌ను దాటేసి బెజోస్ అగ్రస్థానంలో నిలిచాడు. అయితే బెజోస్ ఆనందం ఎంతసేపో నిలవలేదు. సాయంత్రం మార్కెట్ ముగిసే సమయానికి అమెజాన్ షేర్ విలువ 0.7 శాతానికి పడిపోయింది. దీంతో బెజోస్ సంపద ఒక్కసారిగా 89.3 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

అయితే ప్రపంచ సంపన్నుడిగా బెజోస్ అవతరించారంటూ పత్రికల్లో, టీవీల్లో ప్రచారం జరిగింది. కానీ అది ఒక్కపూట మాత్రమే. కేవలం నాలుగైదు గంటలపాటు ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా బెజోస్ నిలిచారు. ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ బెజోస్ కొన్ని గంటలపాటు అత్యంత సంపన్నుడిగా ఉండి మళ్లీ కిందకి పడిపోయారు. కాగా, 2013 మే నుంచి బ్లూంబర్గ్‌ బిలియనీర్ల జాబితాలో బిల్‌గేట్స్‌దే అగ్రస్థానం. అయితే ఇప్పుడు ఆ స్థానాన్ని బెజోస్ కొన్ని గంటలపాటు సొంతం చేసుకుని మళ్లీ బిల్‌గేట్స్‌కే ఇచ్చేశారు. తాజా జాబితాలో బిల్‌గేట్స్ 90.7 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. ఇక 89.3 బిలియన్ డాలర్ల సంపదతో జెఫ్ బెజోస్ రెండో స్థానంలో నిలిచారు. స్పానిష్ వ్యాపారవేత్త అమన్సియో ఓర్టేగా మూడో స్థానంలో ఉన్నారు.


పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

Posted 10 days ago | Category : business

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

Posted 11 days ago | Category : business

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

Posted 12 days ago | Category : business

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

Posted 12 days ago | Category : business

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

Posted 14 days ago | Category : business

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Posted 14 days ago | Category : business

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్ సర్ జి..!

Posted 18 days ago | Category : business

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్  సర్ జి..!

లాభాలలో ఆపిల్ సంస్థ......!

Posted 19 days ago | Category : business

లాభాలలో ఆపిల్ సంస్థ......!

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

Posted 19 days ago | Category : business

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

Posted 19 days ago | Category : business

 ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

సరికొత్త షార్ట్ థియేటర్..!

Posted 19 days ago | Category : business

సరికొత్త షార్ట్ థియేటర్..!