జనసేనకు సీన్ లేదన్న మంత్రికి పవన్ కౌంటర్

Posted 5 months ago | Category : politics

అశోక్ గజపతి రాజు గారికి పవన్ కళ్యాణ్ ఎవరో తెలీదు. మంత్రి పితాని గారికి పవన్ కళ్యాణ్ ఏంటో తెలీదు. సంతోషం... ఈ మాటలన్నది ఎవరో కాదు. స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో పేర్కొన్న పదాలు. అప్పుడెప్పుడో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణా ఆయనెవరో నాకు తెలీదు అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగారికి కౌంటర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇంకో మంత్రి గారు పవన్‌పై వ్యాఖ్యలు చేశారు. అసలు జనసేన పోటీలోనే లేదని టీడీపీ, వైసీపీ మధ్యే ప్రధాన పోటీ అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ పవన్ కళ్యాణ్‌పై, ఆయన పార్టీ జనసేనపై గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇంతవరకు పార్టీ పెట్టలేదని, జెండా కట్టిన పాపాన పోలేదని పితాని వ్యాఖ్యానించారు. బయటకు రాకుండా సమస్యలమీద మాట్లాడటమేంటని ప్రశ్నించారు. ఇప్పటి వరకు జనసేన జెండా పట్టుకున్న కార్యకర్తను గానీ, నాయకుడిని కానీ చూడలేదన్నారు. పార్టీ నిర్మాణమే లేనప్పుడు జనసేన గెలుస్తుందని ఎలా అనుకుంటున్నారని పితాని విలేకరులను ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్యే ప్రధాన పోటీ అని జోష్యం చెప్పారు.

ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగితే అప్పుడు ఆ పార్టీ గురించి ఆలోచిస్తామని, మాట్లాడతామని పితాని చెప్పారు. అసలు పవన్ గురించి మాట్లాడే సమయం తనకు లేదని హేళనగా అన్నారు. పితాని వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ శుక్రవారం ట్విట్టర్ ద్వారా స్పందించారు. గతంలో పవన్ ఎవరో తెలియదన్న అశోక్ గజపతి రాజు పేరును కూడా ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. పవన్ ట్వీట్‌ను బట్టి చూస్తుంటే పితాని మాటలను ఆయన సీరియస్‌గానే తీసుకున్నట్లు అర్థమవుతోంది.


కనండి.. కంటూనే ఉండండి..!

Posted 42 minutes ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 2 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 9 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 10 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

విషం పెట్టి చంపాలని చూసారు !

Posted a day ago | Category : politics

విషం పెట్టి చంపాలని చూసారు !

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

Posted a day ago | Category : politics

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి : J C Diwakar reddy Anantapur ;ins.media

Posted 2 days ago | Category : politics

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి :  J C Diwakar reddy Anantapur ;ins.media

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

Posted 2 days ago | Category : politics

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

Posted 2 days ago | Category : politics

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

Posted 2 days ago | Category : politics

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!

Posted 2 days ago | Category : politics

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!