ఎన్నికల్లో నేను ఓడి పోవచ్చేమో కానీ దెబ్బకొట్టే వెళ్తా....పవన్

Posted a month ago | Category : politics

పార్టీ కార్యకర్తల సమావేశంలో జనసేన అధినేత పవన్ మాట్లాడుతూ జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తనను అడిగారని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విలీనం చేయనని తేల్చి చెప్పానని ఆయన తెలిపారు. ఇవాళ పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. బీజేపీలోకి వెళ్లే ఉద్దేశం ఉంటే జనసేనను ఎందుకు స్థాపిస్తాను అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. "అవకాశవాద రాజకీయాలకు నేను ఎప్పటికీ వ్యతిరేకమని.. కార్యకర్తలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని పోగొట్టుకోను" అని పవన్ చెప్పుకొచ్చారు.

ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చినా ముందుకెళ్తానే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. "ఎన్నికల్లో నేను ఓడి పోవచ్చు కానీ దెబ్బకొట్టే వెళ్తాను"అని పవన్ వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీలు బాగా పనిచేస్తే ప్రాంతీయ పార్టీలు పుట్టవన్న విషయాన్ని ఈ సందర్భంగా పవన్‌ గుర్తు చేశారు.

అంతే కాదు కొందరు టీడీపీ నేతలు నన్ను అవమానించినా కేవలం ప్రజల కోసమే టీడీపీకి మద్దతిచ్చాను అని పవన్ కల్యాణ్‌ మరోసారి స్పష్టం చేశారు. అరెస్ట్‌ చేసిన నా అభిమానులను విడుదల చేయాలని ఎంపీ గోకరాజు గంగరాజుకు ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయలేదు అని పవన్ పేర్కొన్నారు. అవకాశవాద రాజకీయాలకు ఇదే నిదర్శనమని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


పవన్ కి పంచ్ వేసిన అచ్చెన్న !

Posted 3 hours ago | Category : politics

పవన్ కి పంచ్ వేసిన అచ్చెన్న !

నెల్లూరులో జగన్...

Posted 3 hours ago | Category : politics

నెల్లూరులో జగన్...

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

Posted 19 hours ago | Category : politics

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

Posted 20 hours ago | Category : politics

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

Posted a day ago | Category : politics

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

Posted a day ago | Category : politics

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

Posted a day ago | Category : politics

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

Posted 2 days ago | Category : politics

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

పవన్‌ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted 2 days ago | Category : politics

పవన్‌ పై  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

Posted 2 days ago | Category : politics

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ

Posted 2 days ago | Category : politics

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ