ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

నేడు చినకాకానిలో పవన్ 'చలోరే చలోరే చల్‌’ పర్యటన.

Posted 3 days ago politics

జ‌న‌సేన మ‌రోసారి జ‌నంలోకి వచ్చింది. ఈసారి స్ప‌ష్ట‌మైన లక్ష్యంతో.. భ‌విష్య‌త్ కార్యాచ‌రణ‌పై కాస్తంత క్లారిటీతో వ‌చ్చిన‌ట్టే కనిపిస్తున్నాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌. అజ్ఞాతవాసి షూటింగ్ మూడు రోజుల క్రితమే పూర్తయ్యింది. అజ్ఞాతవాసి షూటింగ్ అలా పూర్తయ్యిందో లేదో ఇలా పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్ర మొదలుపెట్టాడు.

'చలోరే చలోరే చల్‌’ పర్యటనతో ఏపీ రాజకీయాల్లో సెగ రాజేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు గుంటూరు జిల్లా చినకాకానిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీలిస్తారు. అలాగే పార్టీ కార్యాలయం కోసం భూమి ఇచ్చిన రైతులతో పవన్ సమావేశం కానున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.

కాగా, తన పర్యటనలో భాగంగా గురువారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో వైసీపీ నేతలు కూడా పోలవరాన్ని సందర్శించడంతో ఏపీ రాజకీయం మొత్తం ఆ ప్రాజెక్టు చుట్టూ తిరుగుతోంది.

Related Articles

Most Read