కేసీఆర్ మా దేవుడు అంటున్న షేక్ జలీల్ ఖాన్.

Posted 9 months ago | Category : state politics

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పాలిట దేవుడిలాంటివాడని ఆంధ్రా ముస్లిం వేదిక కొనియాడింది. ముస్లిం మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయడం హర్షనీయమని పేర్కొంది. అది కూడా ఢిల్లీ సాక్షిగా కావడం గమనార్హం. తెలంగాణలో మాదిరి ఆంధ్రప్రదేశ్ లోను ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రా ముస్లిం వేదిక ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్షకు దిగింది. ఈ సందర్భంగా ముస్లిం ఐక్య వేదిక అధ్యక్షుడు షేక్ జలీల్ ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ సీఎంపై ప్రశంసలు కురిపించారు.

వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ కు మద్దతుగా అన్ని ప్రాంతాల్లో కరపత్రాలు పంచుతామని ఏపీలో సైతం ఆ పార్టీని విస్తరించాలన్నది తమ అభిమతమని జలీల్ ఖాన్ పేర్కొన్నారు. కేసీఆర్ తన మంత్రివర్గంలో ముస్లింకు ఏకంగా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని కానీ ఏపీలో మాత్రం ఒక్క ముస్లింను కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదంటూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఖరిని తప్పుపట్టారు. ఏపీ ముఖ్యమంత్రి ముస్లింలపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని దుయ్యబట్టారు. చివరకు ముస్లిం మైనారిటీ మంత్రిత్వశాఖకు మంత్రి కూడా లేకపోవడం బాధాకరమని జలీల్ వాపోయారు. ముస్లిం రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వం సరిగా స్పందించకపోతే తమ నిరసనలు మొదలుపెడ్తామని తెలిపారు.


బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

Posted 2 hours ago | Category : state

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

Posted 2 hours ago | Category : state

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

Posted 4 hours ago | Category : state

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

Posted 6 hours ago | Category : state

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్ వర్మ..!

Posted 8 hours ago | Category : state

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్  వర్మ..!

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

Posted 9 hours ago | Category : state

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 9 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 10 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

మద్యం మత్తులో మందు భామలు..!

Posted 11 hours ago | Category : state

మద్యం మత్తులో మందు భామలు..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 11 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 11 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!