జగన్ టార్గెట్ వారే...!

Posted 2 months ago | Category : politics

వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ పాద‌యాత్ర అనంత‌పురం జిల్లాలోకి ప్ర‌వేశించింది. క‌డ‌ప‌, క‌ర్నూలు జిల్లాల్లో యాత్ర‌ను ముగించుకున్న జ‌గ‌న్ అనంత‌పురం జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అనంత‌పురం జిల్లాలోకి జ‌గ‌న్ ఎంట్రీ ఇచ్చిన వెంట‌నే వైసీపీలో మాంచి జోష్ వ‌చ్చేసింది. గుంత‌క‌ల్ మాజీ ఎమ్మెల్యే, జేసీ దివాక‌ర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు మ‌ధుసూద‌న్ గుప్తా జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. పాద‌యాత్ర ముగిసే లోపుగా ఆయ‌న వైసీపీ తీర్థం పుచ్చుకుంటార‌ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే అనంత‌పురం జిల్లాలో జ‌గ‌న్ ఇద్ద‌రిని బాగా టార్గెట్ చేసిన‌ట్టు క‌న‌ప‌డుతోంది.

జిల్లాలో టీడీపీకి రాజ‌కీయంగా కీల‌కంగా ఉన్న మంత్రి ప‌రిటాల సునీత‌తో పాటు, జేసీ బ్ర‌ద‌ర్స్‌ను దెబ్బ‌తీసేలా జ‌గ‌న్ అనంత పాద‌యాత్ర ఉండ‌నుంది. వీరిని టార్గెట్ చేసేందుకు జగన్ అనంతపురం జిల్లా పాదయాత్రలో ఈ రెండు నియోజకవర్గాలను ప్రధానంగా ఎంచుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గానికి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి , రాప్తాడు నియోజకవర్గానికి మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ ఇద్ద‌రిని ఓడించ‌డం ద్వారా ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ జెండా ఎగ‌ర‌వేయాల‌ని జ‌గ‌న్ ప్లాన్ చేశాడు. ప్ర‌స్తుతం గుంత‌కల్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తోన్న జ‌గ‌న్ ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఏకంగా 250 కిలోమీట‌ర్ల పాద‌యాత్ర చేయ‌నున్నాడు. గుంత‌క‌ల్ నుంచి జ‌గ‌న్ తాడిప‌త్రిలోకి ప్ర‌వేశిస్తాడు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో 13.5 కిలోమీట‌ర్ల ప్ర‌యాణం చేస్తాడు. ఆ త‌ర్వాత మంత్రి సునీత రాఫ్తాడులోకి జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌వేశిస్తుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఏకంగా 46.5 కిలోమీట‌ర్ల మేర జ‌గ‌న్ పాద‌యాత్ర ఉంటుంది.

ఓవ‌రాల్‌గా జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. తాడిప‌త్రి, రాఫ్తాడులోనూ ఈ స్పంద‌న ఇలాగే ఉంటుంద‌ని భావిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 28వ రోజుకు చేరుకుంది. మ‌రి జిల్లాలో బ‌ల‌మైన ఫ్యామిలీలుగా ఉన్న జేసీ, ప‌రిటాల ఫ్యామిలీల‌ను టార్గెట్ చేసిన వీరి కంచుకోట‌ల‌ను ఎంత వ‌ర‌కు కూలుస్తాడో....? చూడాలి మరి.


దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

Posted 3 hours ago | Category : politics

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని  ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

Posted 3 hours ago | Category : politics

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

రంగం లోకి లోకనాయకుడు....!

Posted 6 hours ago | Category : politics

రంగం లోకి  లోకనాయకుడు....!

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted a day ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted a day ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted a day ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 3 days ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 3 days ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 4 days ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!