//single page style gallary page

పవన్ అన్నేసి మాటలు అన్నా జగన్ పార్టీ నోరు మెదపనిది అందుకేనా ?

Posted 7 months ago | Category : state

గత నాలుగు రోజుల్లో పవన్ కళ్యాణ్ పలు పర్యటనలు చేసి ఇటు ప్రభుత్వం పై అటు ప్రతిపక్ష నాయకుడి పై పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే ఏం చేయడానికైనా వెనుకాడనని, అటు పోలవరం నుంచి ఫాతిమా విద్యార్థుల సమస్య వరకు, ప్రత్యేక హోదా నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల వరకు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పైనా, ఆ పార్టీ చీఫ్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపైన విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ చేయాల్సిన పనులను తాను చేయాల్సి వస్తోందంటూ నిందించారు. జగన్ వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.

అయితే పవన్ టీడీపీ పై చేసిన విమర్శలకు ఆ పార్టీ నేతలు స్పందించగా, తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు. పవన్‌ విమర్శలను తిప్పి కొట్టారు. ఏదైనా మాట్లాడేముందు ఆ విషయం గురించి అవగాహన పెంచుకోవాలని చురకలు వేశారు. బీజేపీ నేతలు కూడా పవన్‌కు కౌంటర్ ఇచ్చారు. అయితే ప్రతిపక్ష వైసీపీ నుంచి మాత్రం స్పందన కరువైంది. అసలు జనసేన పై వైసీపీ విధానమేంటో తెలియక ఆ పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు.

నిజానికి పవన్ విమర్శలపై స్పందించడానికి వైసీపీ నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సాధారణంగా చీటికి మాటికి మీడియా ముందుకు వచ్చే సీనియర్లు సైతం పవన్ విషయంలో మౌనం దాల్చారు. పవన్‌పై ఎలా రియాక్ట్ కావాలన్న విషయంలో పార్టీలో గందరగోళం నెలకొందని చెబుతున్నారు. పవన్‌ పై అతిగా స్పందిస్తే ఎటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న దానిపై పార్టీలో క్లారిటీ కరువైంది. ఒకవేళ పవన్‌పై విరుచుకుపడితే ఆయన స్పందిస్తారు. ఫలితంగా వైసీపీ-జనసేన మధ్య అది వార్‌గా మారుతుంది.

అదే జరిగితే ఇప్పటికే ప్రతిపక్షంగా విలఫమైనట్టు ఆరోపణలున్న వైసీపీకి అది పెనునష్టం కలిగించే అవకాశం ఉంది. దీనికి తోడు పవన్ విషయంలో కొంత సంయమనం పాటించాలన్న ‘పీకే’ సలహా కూడా కొంత కారణమని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపును సొంతం చేసుకోవాలంటే జనసేన మద్దతు ఎంతో అవసరమని పీకే సలహా ఇచ్చారని సమాచారం. ఇటీవల జగన్ తన సొంత చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ గురించి మాట్లాడుతూ ప్రభుత్వంపై పోరాడేందుకు జనసేన వస్తే కలిసి పనిచేస్తామని చెప్పడానికి అదే కారణమని అంటున్నారు.


సినిమాలని తలపిస్తున్న యశోద హాస్పిటల్ సీన్స్...!

Posted 10 hours ago | Category : state

సినిమాలని తలపిస్తున్న యశోద హాస్పిటల్ సీన్స్...!

నగర పోలీస్ కమీషనర్ గా ద్వారకా తిరుమల రావు

Posted a day ago | Category : state

నగర పోలీస్ కమీషనర్ గా ద్వారకా తిరుమల రావు

ఉత్తరాంధ్ర కి భారీ వర్ష సూచన......అప్రమత్తమైన జిల్లాల యంత్రాగం!

Posted a day ago | Category : state

ఉత్తరాంధ్ర కి భారీ వర్ష సూచన......అప్రమత్తమైన జిల్లాల యంత్రాగం!

మోడల్ లో మాతృత్వం...ర్యాంపు పై మాతృ ప్రేమ..

Posted a day ago | Category : state

మోడల్ లో మాతృత్వం...ర్యాంపు పై మాతృ ప్రేమ..

సోషియల్ మీడియా కంటెంట్ పై ...ప్రభుత్వం పైర్...

Posted a day ago | Category : state

సోషియల్ మీడియా కంటెంట్ పై ...ప్రభుత్వం పైర్...

టీడీపీ కి గుడ్బై చెప్పనున్న జేసీ..... !

Posted a day ago | Category : state politics

టీడీపీ కి గుడ్బై చెప్పనున్న జేసీ..... !

విజయవాడ లోని స్టార్ హోటల్ లో నగ్న నృత్యాలు...!

Posted a day ago | Category : state

విజయవాడ లోని స్టార్ హోటల్ లో నగ్న నృత్యాలు...!

సినీ అభిమానులకి తెలంగాణ సర్కార్ శుభవార్త......!

Posted a day ago | Category : state

సినీ అభిమానులకి తెలంగాణ సర్కార్ శుభవార్త......!

పెట్రోల్ బంక్ లో మరో ఆఫర్...

Posted a day ago | Category : state

పెట్రోల్ బంక్ లో మరో ఆఫర్...

బల్కంపేట కల్యాణోత్సవంలో ...ఆఖరి ఘట్టం....

Posted a day ago | Category : state

బల్కంపేట కల్యాణోత్సవంలో ...ఆఖరి ఘట్టం....

శ్రీవారి భక్తులకి శుభవార్త....!

Posted 2 days ago | Category : state

శ్రీవారి భక్తులకి శుభవార్త....!