//single page style gallary page

6 నుంచి పాదయాత్ర - మారిన జగన్‌ షెడ్యూల్‌

Posted a year ago | Category : politics

వైసిపి అధ్యక్షులు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తలపెట్టిన పాదయాత్ర షెడ్యూల్‌ మారింది. ముందు ప్రకటించిన విధంగా నవంబర్‌ 2 నుంచి కాకుండా ఆరో తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని పార్టీ అధికారికంగా ప్రకటించింది. జగన్‌ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును సిబిఐ కోర్టు తిరస్కరించడంతో పాదయాత్ర షెడ్యూల్‌లో స్వల్పంగా మార్పులు చేయాల్సి వచ్చింది. నవంబర్‌ 2 గురువారం. ఆ వెంటనే 3వ తేదీ శుక్రవారం జగన్‌ కోర్టుకు హాజరు కావాల్సిన ఉంది. అందువల్ల నవంబర్‌2కు బదులు 6వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. జగన్‌ నవంబరు 3న కోర్టుకు హాజరై ఆ సాయంత్రం తిరుమలకు వెళతారు.

4న శ్రీవారిని, 5న కడపలోని దర్గాను సందర్శిస్తారు. 6వ తేదీన ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించి పాదయాత్రను ప్రారంభిస్తారు. ఇదిలావుండగా సిబిఐ న్యాయస్థానం తీర్పుపై జగన్‌ అప్పీల్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనిపై న్యాయనిపుణుల సహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై పార్టీ నేతల్లో భిన్న వాదనలు పాదయాత్ర 6 నుంచి ప్రారంభిస్తుండగా , 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అందువల్ల వైసిపి శాసనసభ్యులు సమావేశాలకు హాజరయ్యే విషయంపై పార్టీ నేతల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగన్‌ ఈసారి సమావేశాలకు హాజరుకాకపోవచ్చని చర్చ సాగుతోంది. అసెంబ్లీ సమావేశాలను మూకుమ్మడిగా బహిష్కరిస్తే, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లగలవనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. బహిష్కరణ వల్ల టిడిపి కంటే వైసిపికే ఎక్కువ నష్టమంటున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై...ప్రజా సమస్యలపై పోరాడటం ద్వారా తమ చిత్తశుద్ది నిరూపించుకోవడమే కాకుండా ఫిిరాయింపులపై గట్టిగా పోరాడటానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేనప్పుడు, నేరుగా ప్రజల్లోకి వెళ్లడమే మంచిదని కొందరంటున్నారు.


సీఎం చంద్ర‌బాబుపై వైర‌ల్ న్యూస్‌..!

Posted 5 hours ago | Category : politics state

సీఎం చంద్ర‌బాబుపై వైర‌ల్ న్యూస్‌..!

జగన్ కి షాక్ ఇచ్చిన పోలీసులు..

Posted 7 hours ago | Category : politics

జగన్ కి షాక్ ఇచ్చిన పోలీసులు..

చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు..

Posted 7 hours ago | Category : politics

చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు..

ఫోర్‌స్టేట్స్ .....ఎన్నికలపై ఆ నాలుగు రాష్ట్రాలేం చెబుతున్నాయి ...!

Posted 9 hours ago | Category : politics

ఫోర్‌స్టేట్స్ .....ఎన్నికలపై  ఆ నాలుగు రాష్ట్రాలేం చెబుతున్నాయి ...!

నాయిని వ‌ర్గీయుల‌పై చేయి చేసుకున్న వీహెచ్‌..!

Posted 11 hours ago | Category : politics

నాయిని వ‌ర్గీయుల‌పై చేయి చేసుకున్న వీహెచ్‌..!

తెలంగాణా ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలన్న మోహన్ బాబు ... రీజన్ అదే

Posted 11 hours ago | Category : politics

తెలంగాణా ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలన్న మోహన్ బాబు ... రీజన్ అదే

చిరంజీవి తీసుకున్న సంచలన నిర్ణయానికి రీజన్ అదే

Posted 12 hours ago | Category : politics

చిరంజీవి తీసుకున్న సంచలన నిర్ణయానికి రీజన్ అదే

మేము కోరిన‌న్న సీట్లు ఇవ్వాల్సిందే..!

Posted 12 hours ago | Category : politics

మేము కోరిన‌న్న సీట్లు ఇవ్వాల్సిందే..!

హైటెన్ష‌న్ మ‌ధ్య మొద‌లైన పోలింగ్‌..!

Posted 12 hours ago | Category : politics

హైటెన్ష‌న్ మ‌ధ్య మొద‌లైన పోలింగ్‌..!

ఎమ్మెల్యే అభ్య‌ర్థులకు హెచ్చ‌రిక‌.. ఈ తేదీల్లో అస్స‌లు నామినేష‌న్ వేయ‌కండి..!

Posted 13 hours ago | Category : politics

ఎమ్మెల్యే అభ్య‌ర్థులకు హెచ్చ‌రిక‌.. ఈ తేదీల్లో అస్స‌లు నామినేష‌న్ వేయ‌కండి..!

కేసీఆర్ సంచలనం ... దేశ రాజకీయాల్లో కీ రోల్ నాదే

Posted 13 hours ago | Category : politics

కేసీఆర్ సంచలనం ... దేశ రాజకీయాల్లో కీ రోల్ నాదే