ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

జగన్ దెబ్బకు జనం ఫిదా.!

Posted a month ago politics

పెద్దయెత్తున అభిమానులు తరలి రావడం, స్థానిక గ్రామాల ప్రజలు జగన్ తో కరచాలనం చేయాలని ఉత్సాహ పడుతుండటంతో ఆయన అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. జగన్ కేవలం పాదయాత్ర మే చేయడం లేదు. వివిధ సంఘాల స్థానిక నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. వారి సమస్యలను ఓపిగ్గా వింటున్నారు. వాటిని తన మేనిఫేస్టోలో చేరుస్తానని చేతిలో చెయ్యేసి మరీ చెబుతున్నారు.దీంతో జగన్ తీరుకు స్థానికులు ఫిదా అవుతున్నారు. మూడోరోజు ఆయన ముస్లిం సోదరులతో కలసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. వీరగట్టుపల్లిలో బీసీ సంఘాల నేతలతో సమావేశమయ్యారు.బీసీ సంఘాల నేతలు చెప్పిన సమస్యలను నోట్ చేసుకున్నారు. వీటిని మ్యానిఫేస్టోలో ఉంచేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.

నాలుగో రోజు ఇలా...

ఇక జగన్ పాదయాత్ర ఈరోజు నాలుగోరోజుకు చేరుకుంది. ఇప్పటి వరకూ జగన్ దాదాపు నలభై కిలోమీటర్ల మేరకు ప్రయాణించారు. నాల్గోరోజు జగన్న పాదయాత్ర ఉరుటూరు గ్రామం నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 8.30 గంటలకు ప్రారంభంకానున్న ఈ యాత్ర సర్వరాజుపేట గ్రామం మీదుగా సాగనుంది. అక్కడి నుంచి వై కొండూరు జంక్షన్ కు జగన్ చేరుకుంటారు. అక్కడే భోజన విరామానికి ఆగుతారు. అక్కడి నుంచి ఎర్రగుంట్ల పట్టణానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఎర్రగుంట్ల-ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో రాత్రి బస చేస్తారు. నాల్గో రోజు మొత్తం 10.9 కిలోమీటర్ల మేరకు జగన్ పాదయాత్ర చేయనున్నారు. ఒక బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. తనపై వస్తున్న ఆరోపణలకు ఎప్పటికప్పుడు జగన్ సమాధానమిస్తున్నారు. టీడీపీ నేతలు చేసే విమర్శలను ప్రజల సమక్షంలోనే తిప్పికొడుతున్నారు.

Related Articles

Most Read