//single page style gallary page

పద్ధతి మార్చుకున్న జగన్...!

Posted 7 months ago | Category : politics

ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ కొన్ని పొర‌పాట్లు చేయ‌డం.. వాటిని స‌రిజేసుకోక‌పోవ‌డం! కొన్ని త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకోవ‌డం.. వాటి ద్వారా ఎదురు దెబ్బ‌లు త‌గిలినా త‌న పంథా మార్చుకోక‌పోవ‌డం ఇదీ జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలి!

ఇప్పుడిప్పుడే ఆయన స‌రైన ట్రాక్‌లో ప‌డుతున్నార‌ని భావించేలోగానే.. ఆయ‌న తీసుకున్న ఒక‌ నిర్ణ‌యం మ‌రోసారి పార్టీలో చ‌ర్చ‌నీయాంశ మైంది. ఇప్పుడు ఆయన క్లాస్ నాయ‌కుల వెంట‌ప‌డుతూ.. మాస్ నాయ‌కుల‌ను దూరం పెట్ట‌డం జ‌గ‌న్‌కు మ‌రోసారి ఇబ్బందులు తెచ్చే ప్ర‌మాదం లేక‌పోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. క్లాస్ నాయ‌కుల‌ను త‌న చుట్టూ పెట్టుకుని.. ఫైర్ బ్రాండ్లుగా పేరు తెచ్చుకున్న పలువురుని సైలెంట్‌గా ఉంచ‌డం స‌రికాద‌నే ఇప్పటికే చ‌ర్చ మొద‌లైంది.

ప్రజాసంక‌ల్ప యాత్ర పేరుతో.. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభించారు. ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచి బ‌రిలోకి దిగిపోయారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న అనుస‌రిస్తున్న పంథా వివాదాస్ప‌దం అవుతోంది. జ‌నాల్లోకి వెళ్లే క్ర‌మంలో జ‌గ‌న్‌ మాస్ లీడ‌ర్ల‌ను న‌మ్ముకోకుండా క్లాస్ లీడ‌ర్ల‌ను న‌మ్ముకుంటున్నారు. విజ‌య‌సాయిరెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వంటి వారిని చేర‌దీసి వారికి రాజ‌కీయ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు.

ఇప్పుడు వీరు వైసీపీకి కీల‌కంగా మారిపోయారు. ఫైర్ బ్రాండ్‌లుగా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి, రోజాను ప్రోత్స‌హించాల్సిన స‌మ‌యంలో వీరిద్ద‌రూ నోళ్లు నొక్కేశార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. అలాగే గుడివాడ ఎమ్మెల్యే నాని కూడా ఫైర్ బ్రాండే.. ఆయ‌న‌పైనా కొన్ని ఆంక్ష‌లు న‌డుస్తున్నాయ‌ని స‌మాచారం.

ప్ర‌స్తుతం జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న పాద‌యాత్ర సాగుతోంది. దీనికి మాస్‌లో ఫాలోయింగ్ రావాల్సిన అవ‌స‌రం ఉంది. అన్ని జిల్లాల్లోనూ ప్ర‌త్యేకంగా పాద‌యాత్ర‌పై ప్ర‌చారం సాగాల్సి ఉంది. ఇక‌ జ‌నాల్ని మ‌రింత‌గా పార్టీకి చేర‌వేయాలంటే.. మాస్ లీడ‌ర్లే కీల‌కం అని చెప్పాలి.. పాద‌యాత్ర‌పై అన్ని జిల్లాల్లోనూ స‌న్నాహ‌క యాత్ర‌లు చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంది. వీటిపై జ‌గ‌న్ కానీ, ఆయ‌న వెంట ఉండే క్లాస్ లీడ‌ర్లు కానీ దృష్టి పెట్ట‌లేదు. చంద్ర‌బాబు నిర్వ‌హించిన వ‌స్తున్నా మీకోసం పాద‌యాత్ర‌ను తీసుకుంటే..

దీనికి ఎన‌లేని ప్రాధాన్యం ఇచ్చిన టీడీపీ ప్ర‌త్యేకంగా వందేమాత‌రం శ్రీనివాస్‌తో పాట‌లు రాయించుకుని, పాడించుకుని ఊరూరా ప్ర‌చారం చేశారు. ఇలా మాస్‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు చేయ‌కుండా.. ఎంత‌సేపూ క్లాస్‌కే ప‌రిమితం అయిపోతే.. పాద‌యాత్ర ముందుకు ఎలా సాగుతుందనే చ‌ర్చ న‌డుస్తోంది. జ‌గ‌న్ మరో క్లాస్ త‌ప్పిదం చేస్తున్నార‌ని, దీనిని ఎంత త్వ‌ర‌గా గ్ర‌హించి.. స‌రిజేసుకుంటే అంత మంచిద‌ని చెబుతున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.


ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

Posted 7 minutes ago | Category : politics

ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్ : జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

Posted 15 minutes ago | Category : politics

బ్రేకింగ్ న్యూస్ :  జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

Posted 21 minutes ago | Category : politics

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

Posted 26 minutes ago | Category : politics

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

Posted 27 minutes ago | Category : politics

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

Posted 33 minutes ago | Category : politics

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

Posted an hour ago | Category : politics

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

Posted 4 hours ago | Category : politics

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

Posted 5 hours ago | Category : politics

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

Posted 8 hours ago | Category : politics

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!

Posted 8 hours ago | Category : politics

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!