//single page style gallary page

నితీష్ బీజేపీ తో చేతులు కలపడం అసాధ్యం !

Posted a year ago | Category : politics

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలని అందరికన్నా ముందుగా ప్రయత్నాలు ప్రారంభించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చివరి క్షణంలో అనూహ్యంగా ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు ప్రకటించడం ప్రతిపక్షాలకు షాక్ కలిగించింది. బీహార్ లో `మహాకూటమి' బీటలు వారనున్నదని, నితీష్ బీజేపీ తో చేతులు కలుపనున్నారని మీడియా కధనాలు పెద్ద ఎత్తున వచ్చాయి. 

అయితే 2019 ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి తన నాయకత్వం పట్ల ఇతర ప్రతిపక్షాలు సుముఖంగా ఉన్నట్లు కనిపించక పోవడంతో అసమ్మతితోనే నితీష్ కొన్ని విషయాలలో బీజేపీ కి సన్నిహితంగా వెడుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. పైగా ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాన మంత్రి అభ్యర్థిగా తనను పరిగణించాలని కూడా ఆయన కోరుకొంటున్నారు. 

అందుకనే జీఎస్టీ ప్రారంభ సూచకంగా అర్ధరాత్రి జరిగిన పార్లమెంట్ సమావేశాలను ఇతర ప్రతిపక్షాలతో  కలసి బహిష్కరించక పోయినా తాను స్వయంగా హాజరు కాకుండా నితీష్ ఒక మంత్రిని పంపారు. తన పార్టీ యంపీలకు పాల్గొనాలని కూడా సూచించ లేదు. 

బీజేపీ తో చేతులు కలపడం వల్లన నితీష్ రాజకీయంగా పొందే ప్రయోజనం ఉండబోదని, ఇంతకన్నా ఉన్నత పదవులను అధిరోహించే అవకాశం ఉండబోదని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం  తన కుటుంభం సభ్యులు పలు అవినీతి కేసులు ఎదుర్కొంటున్న సమయంలో ఆర్ జె డి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం నుండి బయటకు రావడం ద్వారా సాధించెడిది ఏమీ ఉండదు. పైగా ప్రభుత్వంలో నితీష్ పై వత్తిడులు కూడా తీసుకు రాలేరు. బీజేపీతో కలసి ప్రభుత్వం నడిపితే అటువంటి అవకాశం ఉండదు. 

గత సంవత్సరం `ఆర్ యస్ యస్ ముక్త భారత్' కోసం పిలుపిచ్చిన  నితీష్ కుమార్ ను బీజేపీ ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేవు. దానితో 2019 ఎన్నికల వరకైనా ప్రతిపక్షాలతో కలసి ఉండటమే నితీష్ కు రాజకీయంగా కలసి వస్తుంది. బీహార్ లో తన ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఆర్ జె డి, కాంగ్రెస్ పార్టీలకు వారి చెప్పు చేతలలో తాను  ఉన్నట్లు భావించరాదని సంకేతం ఇవ్వడం కోసమే నితీష్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నది. 

షాకింగ్ ...చంద్రబాబు లగడపాటి కోసమే ఆ సంచలన నిర్ణయం తీసుకున్నారా

Posted 31 minutes ago | Category : politics state

షాకింగ్ ...చంద్రబాబు లగడపాటి కోసమే ఆ సంచలన నిర్ణయం తీసుకున్నారా

గూగుల్ లో సంచలనం గా మారిన సెర్చ్ సెన్సేషన్ గా ఎన్టీఆర్ మనవరాలు సుహాసిని

Posted an hour ago | Category : politics

గూగుల్ లో సంచలనం గా మారిన సెర్చ్ సెన్సేషన్ గా ఎన్టీఆర్ మనవరాలు సుహాసిని

కాంగ్రెస్ పార్టీ ఫ్రెండ్లీ పోటీ షాక్ .. అయోమయంలో మిత్రపక్ష పార్టీలు

Posted 2 hours ago | Category : politics state

కాంగ్రెస్ పార్టీ  ఫ్రెండ్లీ పోటీ షాక్ ..  అయోమయంలో మిత్రపక్ష పార్టీలు

నేను టీడీపీలో చేరకపోవడానికి అసలు కారణం ఇదే ....!

Posted 2 hours ago | Category : politics

 నేను టీడీపీలో చేరకపోవడానికి అసలు  కారణం ఇదే ....!

మహాకూటమి లో ఆ నేత కు షాక్... తిరుగుబాటు ఫలితమేనా

Posted 5 hours ago | Category : politics

మహాకూటమి లో ఆ నేత కు షాక్... తిరుగుబాటు ఫలితమేనా

వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బరిలోకి దిగనున్న అన‌సూయ‌..!

Posted 5 hours ago | Category : politics

వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బరిలోకి దిగనున్న  అన‌సూయ‌..!

నాయినిని గట్టి దెబ్బ కొట్టిన కేసీఆర్ .. ముషీరాబాద్, కోదాడ టికెట్లు ఫైనల్

Posted 5 hours ago | Category : state politics

నాయినిని గట్టి దెబ్బ కొట్టిన కేసీఆర్  .. ముషీరాబాద్, కోదాడ టికెట్లు ఫైనల్

వైసీపీలో టెన్షన్ .... ఆ సీనియర్ కు చెక్ పెట్టిన జగన్

Posted 5 hours ago | Category : politics

వైసీపీలో టెన్షన్ .... ఆ సీనియర్ కు చెక్ పెట్టిన జగన్

టీడీపీకి సనత్ నగర్ సీటు అందుకేనా .. తలసానిపై రివెంజ్ తీర్చుకుంటారా

Posted 6 hours ago | Category : politics

టీడీపీకి సనత్ నగర్ సీటు అందుకేనా .. తలసానిపై రివెంజ్ తీర్చుకుంటారా

అలరించిన అమరావతి జలసంబరం ఎఫ్1హెచ్2ఓ రేస్ బాబును ప్రశంసించిన విపక్షాలు ప్రజలు

Posted 6 hours ago | Category : politics

అలరించిన అమరావతి జలసంబరం ఎఫ్1హెచ్2ఓ రేస్  బాబును ప్రశంసించిన విపక్షాలు ప్రజలు

సుహాసిని కలిసిరానున్న సినీ గ్లామర్ .....

Posted 7 hours ago | Category : politics state

సుహాసిని కలిసిరానున్న సినీ గ్లామర్ .....