మోదీ పర్యటనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ఇజ్రాయెల్

Posted 8 months ago | Category : politics

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 4 నుండి మూడురోజుల పాటు జరుపనున్న ఇజ్రాయెల్ పర్యటనకు ఆ దేశ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. బహుశా గత మూడేళ్ళలో మరే  విదేశీ పర్యటనలో పొందని ప్రాధాన్యతను ఆయన పొందబోతున్నారు. 

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ప్రత్యేకంగా కేబినెట్‌ మీటింగ్‌ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ప్రధాని ఇజ్రాయెల్‌కు వస్తున్నారంటూ నెతన్యాహూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. మోదీ తనకు ప్రియమిత్రుడని, అతని రాకకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని నెతన్యాహు పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు, పోప్‌లు ఇజ్రాయెల్‌లో పర్యటించినపుడు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో మోదీకి కూడా అదేవిధంగా అద్భుత స్వాగత సత్కారాలు చేయనున్నారు. ఈ పర్యటనకు చారిత్రక ప్రాధాన్యముంది. ఇజ్రాయెల్-భారత్ మధ్య దౌత్య సంబంధాలు మొదలై ఈ ఏడాది 25 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. అంటే ఇజ్రాయెల్-భారత్ దౌత్య సంబంధాలకు ఇది రజతోత్సవ సంవత్సరం. 

పైగా,  ఇజ్రాయెల్‌లో పర్యటించబోతున్న తొలి భారత ప్రధానమంత్రి కూడా నరేంద్రమోదీనే. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లైనప్పటికీ ఇంతవరకూ ఒక్క ప్రధాని కూడా ఇజ్రాయెల్‌లో పర్యటించలేదు. పైగా 1992 వరకు కూడా ఇజ్రాయెల్‌తో మనదేశానికి దౌత్య సంబంధాలు పెద్దగా లేవు. 1992లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు చొరవతో ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలకు బీజాలు పడ్డాయి.

రెండువేల సంవత్సరాల పాటు తమకు ఒక భూభాగం అంటూ లేకుండా ప్రపంచం అంతా వ్యాపించిన ఇజ్రాయిల్ ప్రజలు అన్ని చోట్ల అవమానాలు, వేధింపులకు గురయ్యారు. కేవలం భారత దేశం మాత్రమే వారిని గౌరవంగా, మర్యాదగా చూసింది. అందుకనే భారతీయులంటే ఆ  దేశస్థులకు ఎంతో ప్రేమ. అయితే ముస్లిం దేశాలకు కోపం వస్తుందని ఇంతకాలం బహిరంగంగా ఆ దేశంతో దౌత్య సంబంధాలను పెంచుకోలేక పోయాము. 

గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా 2006లో ఆ దేశంలో పర్యటించిన నరేంద్రమోదీ  ఇప్పుడు ప్రధాని హోదాలో ఆ దేశానికి వెళ్తున్నారు. భారత్‌కు ఆయుధాలు సరఫరా చేసే ముఖ్యమైన దేశాల్లో  ఇజ్రాయెల్‌ ఒకటి కావడంతో  మోదీ పర్యటన సందర్భంగా కీలకమైన ఆయుధ కొనుగోలుపై ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. 


దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

Posted 3 hours ago | Category : politics

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని  ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

Posted 3 hours ago | Category : politics

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

రంగం లోకి లోకనాయకుడు....!

Posted 6 hours ago | Category : politics

రంగం లోకి  లోకనాయకుడు....!

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted a day ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted a day ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted a day ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 3 days ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 3 days ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 4 days ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!