//single page style gallary page

తెలుగుదేశం లో ఒక శకం ముగిసిందా?

Posted a year ago | Category : politics editorial state

దేవినేని నెహ్రు మరణం తో తెలుగుదేశం లో ఒక శకం ముగిసిందా?

ఒక విదంగా అవుననే చెప్పాలి.

నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్తాపించినప్పటి నుంచి నేటి వరకు ఎందరో కొత్త కొత్త నాయకులకు తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పిస్తూనే ఉంది.అలా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆయా నియోజకవర్గాలలో నాయకులుగా ఎదిగిన వారు ఎందరో.

కాని మొత్తం తెలుగుగడ్డ పై ప్రాంతాలకు ,కులాలకు ,మతాలకు అతీతంగా తమదైన ముద్ర వేసిన నాయకులు కొందరు ఉన్నారు.తెలుగుదేశాన్ని అన్ని వర్గాల కు దగ్గరచేయడానికి వీరు తమ వంతు కృషి చేసారు.వీరు ఏ ప్రాంతానికి వెళ్ళిన తెలుగుదేశం అభిమానులు వారినే తమవాడిగానే చూసుకొన్నారు. ఆటువంటి అభిమానం సంపాదించటం నిజంగా గొప్ప విషయం. వీరందరి మరణం తెలుగుదేశం పార్టికి, అభిమానులకి తీరని లోటు.కొద్ది రోజుల క్రితం మరణించిన దేవినేని రాజశేఖర్ (నెహ్రు) తో తెలుగుదేశం లో ఒక శకం ముగిసినట్టే.

ఒక్క సారి ఆ నాయకుల చరిత్రను క్లుప్తంగా అవలోకనం చేసుకుందాం.

దేవినేని వెంకటరమణ

(మరణం- జూన్ 4, 1999)

దేవినేని వెంకటరమణ క్రిష్ణ జిల్లా లోని కంచిక చర్ల లో జన్మించారు.నందిగామ నియోజకవర్గం నుంచి శాసనసభ ఎన్నికయ్యారు. సెకండరీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా బాద్యతలు నిర్వహించారు.1999 జూన్ 4 న జరిగిన రైలు ప్రమాదం లో మరణించారు.అప్పటికి ఆయన వయసు 38 సంవత్సరాలు మాత్రమే.

ఎలిమినేటి మాధవరెడ్డి

(మే 1, 1949 - మార్చి 7, 2000)

ఎలిమినేటి మాధవరెడ్డి నల్గొండ జిల్లా భువనగిరి మండలం వడపర్తిలో జన్మించారు. గ్రామసర్పంచి గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, సమితి అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసారు.మాధవరెడ్డి 1981లో స్వగ్రామం వడపర్తి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే ఏడాది భువనగిరి సమితి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. 1985లో భువనగిరి నుంచి తెలుగుదేశం తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు.1995లో చంద్రబాబు మంత్రి వర్గంలో హోంశాఖను పొందారు. 1999లో కూడా శాసనసభకు ఎన్నికయ్యారు. మార్చి 7, 2000 రోజున రాత్రి యాదగిరి గుట్ట నుండి హైదరాబాదుకు తిరిగి వెళ్తుండగా రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ వద్ద మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు గురై దుర్మరణం పాలయ్యారు.

గంటి మోహన చంద్ర బాలయోగి

(అక్టోబర్ 1 ,1945 - మార్చి 3, 2002)

బాలయోగి 1945, అక్టోబర్ 1 న తూర్పు గోదావరి జిల్లా యెదురుగన్నయ్య మరియు సత్యమ్మ లంక గ్రామములో ఒక దళిత రైతు కుటుంబములో జన్మించాడు. ఈయన ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎం.ఏ మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల నుండి లా డిగ్రీలతో పట్టభద్రుడయ్యాడు. 1987 - 1991 తూర్పు గోదావరి జిల్లా పరిషత్ అధ్యక్షుడు. 1991లో 10వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనాడు. 1996 - 1998 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడు, ఉన్నత విద్యా శాఖా మంత్రి.1998 - 12వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనాడు. 1998, మార్చి 24 - 2002, మార్చి 3 లోక్‌సభ స్పీకర్ (తొలి దళిత లోక్‌సభ స్పీకర్).1999 13వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనాడు.

2002, మార్చి 3 న భీమవరము నుండి తిరిగివస్తుండగా సాంకేతిక లోపము వలన హెలికాప్టరు కృష్ణా జిల్లా కువ్వడలంక గ్రామము సమీపములోని ఒక చేపల చెరువులో కూలిపోయి, ఆ ప్రమాదములో బాలయోగి మరణించాడు.

పరిటాల రవీంద్ర

(ఆగష్టు 30, 1958 - జనవరి 24, 2005)

పరిటాల రవీంద్ర 1958 ఆగష్టు 30 న జన్మించారు. స్వగ్రామం - అనంతపురం జిల్లా రామగిరి మండలం నసనకోట పంచాయితీ శివారు వెంకటాపురం.1993 జూన్ 7న పరిటాల రవి తెలుగుదేశం పార్టీలో చేరాడు.1994,1999 మరియు 2004 ఎన్నికలలో పెనుకొండ నుండి శాసనసభకు ఎన్నికయ్యారు.ఎన్టీఆర్ మంత్రి వర్గంలో కార్మికశాఖ మంత్రి గా పని చేసారు.2005 జనవరి 24వ తేదీ రాజకీయ ప్రత్యర్దుల దాడి లో మరణించారు.

కింజరాపు ఎర్రనాయుడు

(ఫిబ్రవరి 23, 1957 - నవెంబర్ 2, 2012)

కింజరాపు ఎర్రనాయుడు ఫిబ్రవరి 23, 1957 లో కోటబొమ్మాలి మండలం లోని నిమ్మాడ గ్రామం లో జన్మించారుఎర్ర నాయుడు 4 సార్లు శాశనసభ కి 4 సార్లు లోక్ సభ కి ప్రాతినిధ్యం వహించారు.రాష్ట్ర శాశనసభ లో చీఫ్ విప్ గా పనిచేసారు.కేంద్రం లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గా కూడా బాద్యతలు నిర్వహించారు.నవెంబర్ 2, 2012 న జరిగిన రోడ్డు ప్రమాదం లో గుండేనొప్పి తో మరణించారు.

లాల్ జాన్ భాషా

(ఆగస్టు 2, 1956 - ఆగస్టు 15, 2013)

లాల్‌జాన్ బాషా ఆగస్టు 2, 1956న గుంటూరులో జన్మించారు. హైస్కూల్ వరకు విద్యనభ్యసించారు. 1991లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి గుంటూరు లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా సుధీర్ఘకాలం పనిచేశారు. ఆగస్టు 15, 2013న నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి వద్ద రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఎన్.టి రామారావు ప్రోద్భలంతో రాజకీయాలలో ప్రవేశించి గుంటురు జిల్లాలో ప్రముఖ రాజకీయ నాయకుడిగా పేరుపొందారు. 1991లో గుంటూరు నుంచి పోటీచేసి ఎన్.జి.రంగా పై విజయం సాధించారు. ఆ రోజుల్లో అదొక సంచలనం.1996, 1998 ఎన్నికలలో రాయపాటి సాంబశివరావు చేతిలో పరాజయం పొందగా,1999 ఎన్నికలలో నరసారావుపేట నుంచి పోటీచేసి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2002లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా, మైనారిటి సెల్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.

భూమా నాగిరెడ్డి

( జనవరి 8, 1964 - మార్చి 12, 2017)

భూమా నాగిరెడ్డి 1964 జనవరి 8 న జన్మించారు. 1987లో రాజకీయ ప్రవేశం చేసిన నాగిరెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా విజయం సాధించారు. చారు. ఈయన లోక్‌సభ సభ్యునిగా మూడు సార్లు తన సేవలను అందించారు. ఈయన దొర్నిపాడు మండలం కొత్తపల్లె యొక్క ఒక మారుమూల గ్రామంలో జన్మించారు. మాజీ మంత్రి యస్.వి.సుబ్బారెడ్డి కుమార్తె ని వివాహం చేసుకున్నారు. ఈమె ఆళ్ళగడ్డ నుంచి 4 సార్లు శాసనసభకు ఎన్నికై 2014 ఎన్నికల ముందు ప్రచారంలో ఉండగా రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు.భూమానాగిరెడ్డి 1987లో రాజకీయ ప్రవేశ్ం చేసి నరసాపురం సింగిల్ విండో అధ్యక్షులుగా ఎన్నికైనారు. 1988లో ఆళ్ళగడ్డ ఎంపిపి అయ్యారు. 1994 ఎన్నికలో ఆళ్ళగడ్డ ఎమ్మెల్యేగా విజయం సాధించగా, 1996, 1998, 1999లలో నుంచి లోకసభకు ఎన్నికైనారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీచేసి నంద్యాలలో ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 ఎన్నికలలో విజయంసాధించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు.ఎమ్మెల్యేగా పదవిలో ఉంటూ మార్చి 12, 2017న హఠాత్తుగా మరణించారు.

దేవినేని నెహ్రు

(జూన్ 22, 1954 - ఏప్రిల్ 17, 2017)

దేవినేని నెహ్రు 1954 జూన్ 22 న విజయవాడ సమీపంలోని కంకిపాడు మండలం, నెప్పల్లిలో జన్మించాడు.నెహ్రూ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవాడు.1982 లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తన రాజకీయ జీవితం ప్రారంభించిన నెహ్రూ మొదటగా ఎన్. టి. ఆర్ మంత్రివర్గంలో సాంకేతిక విద్యాశాఖా మంత్రిగా పనిచేశాడు.కంకిపాడు నియోజక వర్గం నుంచి నాలుగు సార్లు, విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి ఒకసారి మొత్తం ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2017, ఏప్రిల్ 17 సోమవారం ఉదయం 5 గంటలకు హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించాడు.

వీరందరిని నియోజకవర్గాలు, జిల్లాలు, ప్రాంతాలకి అతీతముగా తెలుగుదేశం కార్యకర్తలు అభిమానించారు,అభిమానిస్తారు.వీళ్ళు మరణించినప్పుడు తెలుగుదేశం అభిమానులు తమ ఇంట్లో వాళ్ళు మరణించినంతగా బాధపడ్డారు.ఎక్కడేక్కడో నుంచో కడసారి చూపుకు తరలివచ్చారు.

తెలుగుదేశం పార్టీ ఈ నాయకులు లేని లోటును అధిగమించి సరికొత్త నాయకులతో సరి కొత్త చరిత్రను ఎలా లిఖిస్తుందో కాలమే సమాధానం చెప్తుంది.


ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

Posted 3 hours ago | Category : politics

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

మరల వార్తల్లోకి చేపలమ్ముకునే అమ్మాయి....1.5 లక్షల సాయం..

Posted 4 hours ago | Category : state

మరల వార్తల్లోకి చేపలమ్ముకునే అమ్మాయి....1.5 లక్షల సాయం..

కేరళ ప్రజలని వణికిస్తున్న మరో భయం....!

Posted 5 hours ago | Category : state

కేరళ ప్రజలని వణికిస్తున్న  మరో భయం....!

ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర ధరలు ....కేజీ పచ్చిమిర్చి రూ.400 ....!

Posted 5 hours ago | Category : state

ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర ధరలు ....కేజీ  పచ్చిమిర్చి రూ.400 ....!

పెళ్లిపత్రికను ఈ అడ్రస్ కు పంపిస్తే...శ్రీవారి తలంబ్రాలు మీ ఇంటికి వస్తాయి.! తప్పక తెలుసుకోండి!

Posted 9 hours ago | Category : state

పెళ్లిపత్రికను ఈ అడ్రస్ కు పంపిస్తే...శ్రీవారి తలంబ్రాలు మీ ఇంటికి వస్తాయి.! తప్పక తెలుసుకోండి!

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ విరాళం...!

Posted a day ago | Category : state politics

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్  విరాళం...!

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

Posted a day ago | Category : politics

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

Posted a day ago | Category : politics movies

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

అధికారుల నిర్వాకం: భర్తను మార్చిన అధికారులు, సంసారంలో చిచ్చు

Posted a day ago | Category : national state

అధికారుల నిర్వాకం: భర్తను మార్చిన అధికారులు, సంసారంలో చిచ్చు

కేరళకు ఖతర్ రాజు రూ.35 కోట్ల సాయం

Posted a day ago | Category : national state

 కేరళకు ఖతర్ రాజు రూ.35 కోట్ల సాయం

పెద్దమనసు చాటుతున్న స్టార్ హీరోస్ ....కేరళ కి భారీగా విరాళాలు ...!

Posted a day ago | Category : state movies

పెద్దమనసు చాటుతున్న స్టార్ హీరోస్ ....కేరళ కి భారీగా విరాళాలు ...!