ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

హిందూ యోగి అధికారం చేపట్టకూడదా?

Posted 9 months ago politics editorial

ఉత్తరప్రదేశ్ లో అఖండ విజయం సాధించిన బీజేపీ 'యోగి' ఆదిత్యనాథ్ ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గా సింహాసనం ఫై అధిష్టించింది. ఒక హిందూ యోగికి అతి పెద్ద రాష్ట్ర అధికార మంత్ర దండాన్ని కమలం పార్టీ అప్పగించింది. దీనిపై అప్పుడే ప్రతిపక్షాల్లో అలజడి మొదలయింది. రాష్ట్రాన్ని దేశాన్ని కాషాయికరణ, హిందూకరణ చేసేస్తున్నారంటూ అవి వాపోతున్నాయి. అసలు భారత దేశం హిందూ మెజారిటీ దేశం అని వారు మరిచిపోవడం వల్లే నేడు యూపీ లో నాడు కేంద్రం లో అధికారం కోల్పోయామన్న సంగతి వారు ఇంకా గుర్తించలేదు. ఒక హిందూ సన్న్యాసియో, యోగినో భారత దేశం లో అధికారం చేపట్టడం అంటే లౌకిక వాదానికి భంగ కలుగుతుందని భావించడం ఆ పార్టీల మానసిక స్థితి ఎలాంటిదో పట్టి తెలుపుతోంది. మైనారిటీలని బుజ్జగించి మెజార్టీలను దోషులుగా భావించడం వల్లే నేడు ఆ పార్టీలు దాదాపు అంతర్దాన దశకు చేరుకున్నాయి. అసలు మైనారిటీ ఓట్ బ్యాంకును పట్టించుకోకుండానే బీజేపీ నాడు నేడు ప్రతిపక్షాలను దునుమాడింది. కాంగ్రెస్ తో సహా అన్ని పక్షాలు కులాలు వర్గాలు మతాల వారీగా ప్రణాళికలు రచించుకుంటే బీజేపీ మాత్రం మోడీ మేనియా తో అభివృద్ధి అజెండా తో ముందుకు కదిలి భారీ విజయాల్ని సాధించింది.

బీజేపీ వారు పైకి చెప్పిన చెప్పకపోయినా ఆ పార్టీ హిందువులనంతా ఏకం చేసే పార్టీ గా దేశం లో అవతరించింది. అది ఇప్పుడు మిగిలిన పక్షాలకి కంటగింపుగా మారింది. అందుకే హిందూకరణ వాదాన్ని తెరపైకి తెస్తున్నాయి. అసలు భారత దేశంలో సన్న్యాసులు యోగులు అధికారం చేపట్టకూడదా? అధికారం చేపడితే నేడు కొత్తగా ఏమైనా హింధూకరణ జరిగిపోతుందా? అసలు భారత దేశమే అసలు సిసలు హిందూ దేశమని ప్రపంచ దేశాలు గుర్తిస్తుంటే మనం మాత్రం అది చెప్పుకోవడానికి సిగ్గుపడ్తున్నాం. ఇతర మతాల వారికి భంగం వాటిల్లకూడదనే నాడు మన దేశాన్నిలౌకిక రాజ్యంగా రాజ్యాంగం లో ప్రకటించారు. అనాది కాలం నుండి కేవలం భారత దేశం లోనే సర్వమత సమ్మేళనం, పరమత సహనం ఫరిఢవిల్లింది. అది కేవలం హిందూ ధర్మం లోని పరమాత్ముడు ఒక్కడే అనే జ్ఞాన దీపికవల్లనే సాధ్యమయ్యింది. లేకుంటే మిగిలిన ప్రపంచం లానే మతవిద్వేషాలు ఇక్కడా రగిలేవి. ప్రపంచం లో మైనారిటీలు భారత్ లో ఉన్నంత స్వేచ్ఛగా మరే ఏ దేశం లో లేవని బోలెడన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఐనా అవేవి కుహనా లౌకిక పార్టీలకి పట్టదు వారికి కావాల్సింది మైనార్టీలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడమే.

అందుకే ఈ సారి మైనారిటీ వర్గాలు వారిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే వారి వైపు కాకుండా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే సమర్ధ నాయుకుడివైపే వారు నడిచారు. అందుకే మైనారిటీలు అత్యధిక శాతం కలిగిన యూపీ లో బీజేపీ పాగా వేసింది. మత రాజకీయాల జోలికిపోకుండా మోడీ అభివృద్ధి మంత్రం పఠించడం వల్లనే ఇది సాధ్యమయింది. ఇకనైనా రాజకీయ పక్షాలు దేశ భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటే మంచిది. వారికీ విజయం లభిస్తుంది. మతమే అజెండా గా మోడీ వచ్చి ఉంటే అతనికి దేశ ప్రజలు ఓటు వేసివుండేవారు కాదు. ఇప్పుడు అందరికి కావాల్సింది అభివృద్దే, దేశం బాగుంటేనే అక్కడి ప్రజలు బాగుంటారు. ఈ చిన్న లాజిక్ ని చాలా రాజకీయ పార్టీలు మర్చిపోయాయి.

Related Articles

Most Read