ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

తొడకొట్టి పారిపోయే పిరికిపంద కేసీఆర్

Posted 6 months ago state politics

ఇప్పుటు ఎన్నికలు జరిగితే తెలంగాణాలో 111 సీట్లు గెలుస్తామని అంటూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చెబుతున్న సర్వేని అవహేళన చేస్తూ నిజంగా అంత ధీమా ఉంటె, గెలుస్తామనే ధైర్యం ఉంటె పార్టీలు ఫిరాయించి తన పార్టీలో చేర్చుకున్న వారితో రాజీనామాలు చేయించి గెలిపించుకోమని బిజెపి సీనియర్ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డి సవాల్ చేశారు. మిగిలిన పార్టీలు ఏవీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే తామే గెలుస్తామని అనడం లేదని, అంత దమ్ము  ఉంటె ఎన్నికలకు ఎందుకు భయపడి పారిపోతున్నారని ప్రశ్నించారు. తొడకొట్టి సవాల్ చేసి పారిపోయే కేసీఆర్ కన్నా పిరికి వారు మరెవ్వరు ఉండరని అవహేళన చేశారు. 


రాష్ట్రావతరణ రోజు సందర్భంగా గత ముడేళ్ళల్లో తన ప్రభుతం సాధించిన విజయాలు, అమలు పరచిన ఎన్నికల హామీల గురించి చెబుతారని రాష్ట్ర ప్రజలు ఎదురు చూసారని అయితే మొత్తం ప్రసంగం అంతా ప్రతిసారి చెప్పే అబద్దాలు, అవాస్తవాలతో ఉన్నదని, కొత్తదనం ఏమాత్రం లేదని ఆయన విమర్శించారు.  రైతులకు, చేనేత కార్మికులకు ఏమైనా చేశామని గాని, కొత్త ఉద్యోగాలు కలిపించామని గాని, కొత్తగా పరిశ్రమలు స్థాపించామని గాని ఎక్కడ చెప్పనే లేదని గుర్తు చేశారు. 

చేనేత కార్మికులకు ప్రోత్సాహక వేతనాల క్రింద నెలకు రూ 10 వేలు చొప్పున చెల్లిస్తున్నట్లు చెప్పుకొన్నారని, గత ముడేళ్ళల్లో చేనేత కార్మికులకు ఈ ప్రభుత్వం ఒక రూపాయి అయినా ఖర్చు పెట్టినదా అని ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు. అట్లాగే విద్యుత్ రంగంలో కొత్తగా 16 వేల ఉద్యోగాలు కలిపించామని, 24 వేల తాత్కాలిక ఉద్యోగాలను క్రమబద్దీకరించామని, వేలాది మందికి పదవోన్నతులు కలిపించామని చెప్పుకోవడం పట్ల విస్మయం వ్యక్తం చేసారు. ముడేళ్ళల్లో ఈ రంగంలో ఒక్క కొత్త ఉద్యోగం అయినా ఇచ్చారా లేదా ఒక్క ఉద్యోగాన్ని క్రమబద్దీకరణ చేశారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలు ఏమిటంటే పంచాయత్ వార్డ్ సభ్యుడి నుండి యంపిటీసీ, జడ్పిటిసి లతో పాటు యం ఎల్ ఏ, ఎల్ ఎల్ సి, యం పి ల వరకు ఇతర పార్టీల  నుండి తన పార్టీలోకి ఫిరాయించుకోవడంలో ఘన విజయం సాధించారని అన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మునిసిపల్ పారిశుధ్య సిబ్బంది, ఆర్ టి సి, విద్యుత్ ఉద్యోగుల, ఇతర కార్మిక సంఘాలలో చీలికలు తీసుకు వచ్చి, బలమైన నాయకులను అధికార పార్టీలో చేర్చుకొని, వారు పోరాట పటిమ కోల్పోయే విధంగా చేయడంలో ఈ ప్రభుత్వం ఘన కార్యం చేసిందని ఇంద్రసేనారెడ్డి చెప్పారు. 

తెలంగాణలోని బి సి, యస్ సి, యస్ టి, ఇతర కుల సంఘాలలో చీలికలు తీసుకు వచ్చి, వారిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని, చివరకు ధర్నా చౌక్ కూడా లేకుండా చేసి ప్రభుత్వంపై పోరాడే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారని ఇంద్రసేనారెడ్డి విమర్శించారు.  తెలంగాణ రాష్ట్రం, ప్రజలు వెనుకబడడానికి మూడేళ్ళ కేసీఆర్ ప్రభుత్వం కారణం అవుతున్నదని అంటూ సరైన సమయంలో ప్రజలు ఈ ప్రభుత్వానికి వాత పెట్టడం ఖాయం అని హెచ్చరించారు. 

Related Articles

Most Read