రానున్న దశాబ్దంలో ప్రపంచ వృద్ధికి భారతే ఆధారం !

Posted 8 months ago | Category : world

ప్రపంచ దేశాలతో పోలిస్తే అన్ని రంగాలలో దూసుకు పోతున్న భారత్ రాబోయే దశాబ్దకాలంలో సగటున 7.7 శాతం వార్షిక వృద్ధితో ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఆధారంగా నిలువనున్నదని హార్వర్డ్ యూనివర్సిటీ వెల్లడించింది. కానీ ఇదే సమయంలో ప్రపంచ వృద్ధి మందగించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 

2025 నాటికి భారత్, ఉగాండా దేశాలు 7.7 శాతం వార్షిక వృద్ధిరేటుతో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న దేశాలుగా అవతరించనున్నాయని పేర్కొంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వృద్ధి చోదకంగా ఉన్న చైనా స్థానాన్ని భారత్ భర్తీ చేయనున్నదని, వచ్చే పదేండ్లవరకు భారత్ అత్యధిక వృద్ధి నమోదు చేసుకొంటున్న దేశంగా కొనసాగనున్నదని హార్వర్డ్ యూనివర్సిటీ రూపొందించిన సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ నివేదికలో వెల్లడించింది. 

భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని, ముఖ్యంగా నూతన సెగ్మెంట్‌లో ఆశించిన స్థాయి కంటే మెరుగైన వృద్ధిని సాధిస్తున్నదని తెలిపింది. ఎగుమతుల విషయానికి వస్తే భారత్ ఇతర దేశాలకు గట్టి పోటీనిస్తున్నదని, రసాయనాలు, వాహనాలు, ఎంపిక చేసిన ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో వైవిధ్యంగా నిలస్తుందని పేర్కొంది. చైనా ఎగుమతులు భారీగా పడిపోనున్నాయని తెలిపింది. చైనా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనను వ్యక్తంచేసింది. ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత తొలిసారిగా చైనా వృద్ధిరేటు నాలుగు స్థానాలు పడిపోనున్నదని వెల్లడించింది.

గడిచిన పదేండ్లలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకున్న చైనా ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నదని, ముఖ్యంగా ఎగుమతులు క్షీణించడంతో మందకొడి వృద్ధిని నమోదు చేసుకుంటుందని రిపోర్టులో వెల్లడించింది. అయినప్పటికీ సగటు ప్రపంచ దేశాల కంటే చైనా అధిక వృద్ధి నమోదు చేసుకుంటుందని తెలిపింది.

కేవలం చమురు వ్యాపారంపైనే ఆధారపడటం వల్ల గల్ఫ్ దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, కానీ భారత్, ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాలు అన్ని రంగాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో వచ్చే పదేండ్లలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న దేశాలుగా అవతరించనున్నాయని సీఐడీ డైరెక్టర్, హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ ప్రొఫెసర్ రికార్డో హౌస్మన్ తెలిపారు. 


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 8 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 9 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!