ఉగ్రవాదం పై భారత్, ఇజ్రాయెల్ ఉమ్మడి పోరు

Posted 8 months ago | Category : world

పెరుగుతున్న ఉగ్రవాద, పిడివాద బెడదలపై భారత్, ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేశాయి. తమ బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి విస్తరించుకున్నాయి. ఉగ్రవాద ముఠాలకు ఆశ్రయం, నిధులు సమకూర్చేవారిపై కఠినమైన చర్యలకు ఉమ్మడిగా కదలాలని తీర్మానించుకున్నాయి. రెండు దేశాల ప్రధానులు నరేంద్రమోదీ, బెంజమిన్ నెతన్యాహు జెరూసలేంలో జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో ఉగ్రవాద సమస్య ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. 

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఉమ్మడిపోరుతో పాటుగా వ్యవసాయం, జలసంరక్షణ, అంతరిక్షం తదితర రంగాల్లో సహకార విస్తరణపై అంగీకారం కుదిరింది. సంక్లిష్టమైన భౌగోళిక స్థితిగతుల మధ్య భారత్, ఇజ్రాయెల్ మనుగడ సాగిస్తున్నాయని, ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకు ఎదురవుతున్న వ్యూహాత్మక ముప్పుల గురించి రెండు దేశాలకు లోతైన అవగాహన ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. 

ఉగ్రవాదం వ్యాపింపజేసే హింస, విద్వేషాలకు భారత్ కూడా ఇజ్రాయెల్ తరహాలోనే బలి అవుతున్నదని చెప్పారు. వ్యూహాత్మక ప్రయోజనాలు కాపాడుకునేందుకు, ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు ఇతోధికంగా సహకరించుకోవాలని రెండు దేశాలు అంగీకరించాయని వివరించారు. 

నెతన్యాహు మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని నిరోధించడంలో రెండు దేశాలు సహకరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 26/11 ముంబై ఘటనను ఘోరమైన ఉగ్రదాడిగా పేర్కొన్నారు.ఉగ్రవాదులపై, ఉగ్రవాద సంస్థలపై, వారి నెట్‌వర్క్‌లపై, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి, సహాయం అందించి నిధులు సమకూర్చేవారిపై లేదా ఆశ్రయం కల్పించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఉభయనేతలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు.

ఉగ్రవాద చర్యలను ఏకారణం చేత కూడా సమర్థించడం కుదరదని అందులో స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని వీలైనంత త్వరలో ఆచరణలోకి తేవాలని సూచించారు.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును సతీసమేతంగా భారత్ సందర్శించాల్సిందిగా ప్రధాని మోదీ ఆహ్వానించారు. దీనికి నెతన్యాహు వెంటనే సమ్మతి తెలిపారు.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 8 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 9 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!