పిల్లల ఊబకాయతత్వంలో భారత్ రెండో స్థానం.

Posted 7 months ago | Category : world

అధిక బరువుతో బాధపడే పిల్లల జాబితాలో ప్రపంచంలోనే ఇండియా రెండో స్థానంలో ఉంది. ఇటీవల చేపట్టిన అధ్యయనం ప్రకారం దేశంలో 14.4 మిలియన్ల పిల్లలు అధికబరువుతో ఉన్నట్లు తేలింది. ఈ విషయంలో మన కంటే ముందు చైనా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 2 బిలియన్ల మంది ఆరోగ్య సంబంధమైన అధికబరువు సమస్యను ఎదుర్కొంటున్నారని, దీని వల్ల మరణాలు ముప్పు కూడా పెరుగుతోందని పరిశోధకులు తెలిపారు. అధిక బరువు కారణంగా 2015లో 4 మిలియన్ల మంది మరణించారు. ప్రపంచ జనాబాలో సుమారు 40 శాతం మంది బాడీ మాస్ ఇండెక్స్ ఊబకాయాన్ని సూచిస్తోందని పరిశోధకులు పేర్కొన్నారు.

ప్రపంచ ప్రజారోగ్య సంక్షోభానికి కారణాలు పేరుతో నిర్వహించిన ఈ అధ్యయన వివరాలను న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించారు. ప్రపంచంలోనే అధిక జనాభా గల 20 దేశాల్లోని బాలలు, వయోజనులు అత్యధికంగా ఊబకాయ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ జాబితాలో ఈజిప్ట్ 35 శాతంతో మొదటి స్థానంలో ఉంది. అమెరికాలోనూ 13 శాతం మంది దీని బాధితులే. అత్యల్పంగా బంగ్లాదేశ్, వియత్నాంలు 1 శాతంతో ఉన్నాయి. చైనాలో 15.3 మిలియన్లు, ఇండియాలో 14.4 మిలియన్ల మంది బాలలు ఊబకాయ సమస్యను ఎదుర్కొంటున్నారు. యువత విషయానికి వస్తే 2015 నాటికి అమెరికాలో 79.4 మిలియన్లు, చైనాలో 57.3 మిలియన్లు ఉన్నారు.

అధిక బరువు కారణంగా డయాబెటిస్, కేన్సర్, హృదయ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. ఒక్కోసారి ఇది ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన క్రిస్టోఫర్ ముర్రే పేర్కొన్నారు. 1980 నుంచి 2015 వరకు ప్రపంచంలో 195 దేశాలు, ప్రాంతాల్లో అధ్యయనం చేశారు. అధిక బరువుకు, ఎసిఫ్యాగస్, పెద్ద పేగు, పురీషనాళం, కాలేయం, పిత్తాశయం, పాంక్రియాస్, రొమ్ము, గర్భాశయం, కీడ్నీ కేన్సర్లు, లుకేమియాకు గల సంబంధం, ప్రభావాన్ని గురించి కూడా అధ్యయనం చేసినట్లు ఆయన తెలిపారు. 2015లో ప్రపంచ వ్యాప్తంగా 2.2 బిలియన్ల లేదా 30 శాతం మంది పిల్లలు, వయోజనులు అధిక బరువు ప్రభావానికి గురైనట్లు తెలియజేశారు.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 16 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!