//single page style gallary page

పడిపోయిన ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు

Posted a year ago | Category : business

ప్రైవేట్‌ రంగ దిగ్గజ బ్యాంకులో అగ్రగామిగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ప్రైవేట్‌ లిమిటెడ్‌ లాభాలు పడిపోయాయి. 2017-18 ఆర్థిక సంవత్సర క్యూ1 ఫలితాల్లో బ్యాంకు నికర లాభాలు 8.2 శాతం తగ్గాయి. మొండిబకాయిలు విపరీతంగా పెరగడంతో పాటు, క్రెడిట్‌ గ్రోత్‌ మందగించడంతో బ్యాంకు లాభాలకు గండికొట్టాయి.

గతేడాది ఇదే క్వార్టర్‌లో రూ.2,232.35 కోట్లగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు లాభాలు ఈ ఏడాది జూన్‌ క్వార్టర్‌లో రూ.2,049 కోట్లకు తగ్గాయి. గత క్వార్టర్‌ నుంచి అడ్వాన్స్‌లు ఏ మాత్రం మారకుండా రూ.4.64 ట్రిలియన్లగానే ఉన్నాయి. సీక్వెన్షియల్‌ ఆధారితంగా బ్యాంకు డిపాజిట్లు 0.77 శాతం క్షీణించి రూ.4.86 ట్రిలియన్లుగా నమోదైనట్టు ఐసీఐసీఐ తెలిపింది. స్థూల నిరర్థక ఆస్తులు ఏకంగా బ్యాంకువి 56.5 శాతం పెరిగాయి. దీంతో గతేడాది రూ.27,562.93 కోట్లగా ఉన్న బ్యాంకు ఎన్‌పీఏలు ఈ ఏడాది రూ.43,147.64 కోట్లకు ఎగిశాయి.

క్వార్టర్‌ క్వార్టర్‌కు కూడా బ్యాంకు ఎన్‌పీఏలు 1.4 శాతం పెరిగినట్టు ఐసీఐసీఐ తెలిపింది. మొత్తం రుణాల్లో ఎన్‌పీఏలు 7.89 శాతం నుంచి  7.99 శాతం పెరిగాయి. నికర ఎన్‌పీలు, మొండిబకాయిలు లోన్‌ బుక్‌లో 4.86 శాతం ఎగిసినట్టు తెలిసింది.

ఇటీవలే బ్యాంకులకు భారీగా రుణాలు ఎగొట్టిన మాల్యా వంటి ఘనులు 12 మంది ఉన్నట్టు ఆ‍ర్‌బీఐ గుర్తించిన సంగతి తెలిసిందే. వారిపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలని బ్యాంకులను ఆదేశించింది. ఈ ఎగొట్టిన రుణాల్లో ఐసీఐసీఐ బ్యాంకుకు ఉన్నవి రూ.6,889.46 కోట్లు. ఈ రుణగ్రహీతల నుంచి వచ్చే డిఫాల్ట్ ప్రమాదాన్ని ముందస్తుగా ఎదుర్కొనడానికి బ్యాంకు రూ.2,827.66 కోట్లను పక్కకు తీసి పెట్టింది.


అక్కడ బంగారం కొంటారా...? అదిరిపోయే ఆఫర్

Posted 7 days ago | Category : world business

అక్కడ బంగారం కొంటారా...? అదిరిపోయే ఆఫర్

షియోమీ నుండి మరో అద్భుతమైన ఫోన్..!

Posted a month ago | Category : business

షియోమీ నుండి మరో అద్భుతమైన ఫోన్..!

రేజ్యుం ఇస్తున్నారా..? అయితే ఇక జాగ్రత్త

Posted a month ago | Category : business

రేజ్యుం ఇస్తున్నారా..? అయితే ఇక జాగ్రత్త

బ్యాంకింగ్ వ్యవస్థ పై సివిసి కెవి చౌదరి సంచలన వ్యాఖ్యలు....!

Posted 3 months ago | Category : business

 బ్యాంకింగ్ వ్యవస్థ పై  సివిసి  కెవి చౌదరి సంచలన వ్యాఖ్యలు....!

ఫ్రీ వైఫై అని వాడేస్తున్నారా..?అయితే మీ కొంప కొల్లేరే

Posted 3 months ago | Category : business

ఫ్రీ వైఫై అని వాడేస్తున్నారా..?అయితే మీ కొంప కొల్లేరే

లాభాలలో స్టాక్ మార్కెట్లు

Posted 4 months ago | Category : business

లాభాలలో స్టాక్ మార్కెట్లు

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

Posted 4 months ago | Category : business

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

Posted 4 months ago | Category : business

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

Posted 4 months ago | Category : business

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

Posted 4 months ago | Category : business

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

Posted 4 months ago | Category : business

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!