బ్రిటన్ లో హంగ్ పార్లమెంట్ ... ప్రధాని థెరిసా మే కు షాక్

Posted 9 months ago | Category : world politics

బ్రిటన్‌ పార్లమెంటుకు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో స్పష్టమైన ఆధిక్యత సాధించలేక ప్రస్తుత ప్రధాని థెరిసా మే కి షాక్ తగిలిన్నట్లయింది. తన బలం పెంచుకోవడానికి గడువుకు మూడేళ్ళ ముందే ఎన్నికలలకు వెళ్లిన ఆమెకు ఎదురు దెబ్బ తగిలింది. "బలమైన, స్థిరమైన నాయకత్వం" నినాదంతో ఎన్నికలకు వెళ్లిన ఆమెకు తగు మద్దతు లభించలేదు. 

ఆమె నేతృత్వంలోని కన్జర్వేటివ్‌ పార్టీ 315 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మరో 11 మంది మద్దతు అవసరం ఉంది. మొత్తం 650 స్థానాలకు గాను ఇప్పటి వరకూ 646 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. కన్జర్వేటివ్‌ పార్టీ 315 స్థానాలు గెలుచుకోగా,  ప్రతిపక్ష లేబర్‌ పార్టీ అనూహ్యంగా పుంజుకొని ఇప్పటివరకూ 261 స్థానాల్లో విజయబావుట ఎగరవేసింది. గత ఎన్నికల ఫలితాలతో పోల్చితే 29 స్థానాలను అదనంగా తన ఖాతాలో వేసుకుంది.

లేబర్ పార్టీ కి చెందిన ప్రతిపక్ష నాయకుడు జెరెమీ కార్బయిన్ ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేయగా, అందుకు ఆమె తిరస్కరించారు. "నా పోరాటం కొనసాగిస్తా" అని ప్రకటించారు.  హంగ్ పార్లమెంట్ ఏర్పడటంతో వెంటనే స్టెర్లింగ్ విలువ డాల‌ర్‌తో పోలిస్తే 1.27 డాల‌ర్లు ప‌డిపోయింది.  స్కాటీష్‌ నేషనల్‌ పార్టీ 35, లిబరల్‌ డెమోక్రాట్స్‌ 12 స్థానాల్లో గెలుపొందగా ఇతరులు 13 స్థానాల్లో విజయం సాధించారు. గత ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ 331 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే.

2016లో బ్రెగ్జిట్‌ అనంతరం డేవిడ్‌ కామెరాన్‌ ప్రధాని పదవి నుంచి తప్పుకోగా, థెరిసా మే బాధ్యతలు చేపట్టారు. షెడ్యూల్‌ ప్రకారం తర్వాతి ఎన్నికలు 2020లో జరగాల్సిఉండగా పార్లమెంట్‌లో తన బలం పెంచుకొవాలన్న లక్ష్యంతో మూడేళ్ల ముందుగానే థెరిసా మే ఎన్నికలకు పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన ఉగ్రదాడులు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది.


కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

Posted 11 hours ago | Category : politics

కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

Posted 12 hours ago | Category : politics

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

ప్రధాన మంత్రి మౌనం వీడారు

Posted 13 hours ago | Category : politics

 ప్రధాన మంత్రి మౌనం వీడారు

కనండి.. కంటూనే ఉండండి..!

Posted a day ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted a day ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 2 days ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 2 days ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

విషం పెట్టి చంపాలని చూసారు !

Posted 2 days ago | Category : politics

విషం పెట్టి చంపాలని చూసారు !