ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

స్నాప్‌డీల్‌ విక్రయంపై సాఫ్ట్‌బ్యాంక్‌ పునఃప్రయత్నాలు

Posted 7 months ago world business

ఇ- కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌ను విక్రయించే ఆలోచనతో ఉన్న జపాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ ఈ విషయమై తన ప్రయత్నాలను ముమ్మరం చేయనుంది. వచ్చే కొన్ని వారాల్లోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం... మంగళవారం స్నాప్‌డీల్‌ బోర్డు భేటీ జరిగింది. కంపెనీ విక్రయ ప్రతిపాదనపై ఈ భేటీలో ఏకాభిప్రాయం కుదరలేదు. స్నాప్‌డీల్‌లో సాఫ్ట్‌బ్యాంకు అదిపెద్ద వాటాదారునిగా ఉంది.అయినప్పటికీ విక్రయ ప్రతిపాదనకు ఇతర డైరెక్టర్ల మద్దతును కూడగట్టాలన్న ఆలోచనతో ఉంది.. స్నాప్‌డీల్‌ను దేశీయ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించొచ్చంటూ ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

అసలు స్నాప్‌డీల్‌ బోర్డులో ఏడుగురు సభ్యులున్నారు. సాఫ్ట్‌బ్యాంక్‌, కలారి క్యాపిటల్‌, నెక్సస్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్‌లకు చెందిన ప్రతినిధులతో పాటు సహ వ్యవస్థాపకులైనకునాల్‌ బాల్‌, రోహిత్‌ బన్సల్‌లు ఉన్నారు. స్నాప్‌డీల్‌ను నిర్వహిస్తున్న జాస్పర్‌ ఇన్ఫోటెక్‌ మంగళవారం బోర్డు సమావేశాన్ని నిర్వహించింది. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. స్నాప్‌డీల్‌కు సాఫ్ట్‌బ్యాంక్‌ ఇస్తున్న విలువపై కలారి క్యాపిటల్‌, నెక్సస్‌ వెంచర్‌ పార్టనర్స్‌లు అంగీకరించలేదు. గత కొద్ది నెలలుగా స్నాప్‌డీల్‌ తన సిబ్బందిని తగ్గించుకుంటూ వస్తోంది. ప్రధానేతర వ్యాపారాలను మూసివేసింది కూడా. ఫిబ్రవరి 2016లో కంపెనీ విలువను 6.5 బిలియన్‌ డాలర్లుగా లెక్కగట్టినా.. ఆ తర్వాత విక్రయ ప్రతిపాదనల నేపథ్యంలో తగ్గుతూ వచ్చిందన్నది విశ్వసనీయ వర్గాల అభిప్రాయం..

ఏది ఏమైనా స్నాప్‌డీల్‌ విక్రయంపై వచ్చే 4 నుంచి 8 వారాల్లో నిర్ణయం వెలువడుతుందని ఆ వర్గాలు తెలిపాయి.

Most Read