పాకిస్థాన్ మంత్రివర్గంలో హిందూ నాయకుడికి చోటు

Posted 6 months ago | Category : world

రెండు ద‌శాబ్ధాల త‌ర్వాత పాకిస్థాన్ మంత్రివర్గంలో తొలిసారిగా  ఓ హిందూ రాజకీయ నాయకుడు  మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. తాత్కాలిక ప్ర‌ధానిగా శుక్ర‌వారం  ప్రమాణస్వీకారం చేసిన షాహిద్ అబ్బాసీ 46 మందితో త‌న మంత్రివర్గాన్ని శనివారం విస్త‌రించారు. ఆ మంత్రి వర్గంలోనే మొద‌టి సారి ఓ హిందూ వ్య‌క్తికి కూడా అవ‌కాశం క‌ల్పించారు. 

65 ఏళ్ల ద‌ర్శ‌న్ లాల్‌ మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. పాకిస్థాన్‌లోని నాలుగు రాష్ట్రాలను ద‌ర్శ‌న్ లాల్‌ కోఆర్డినేట్ చేయ‌నున్నారు. పార్ల‌మెంట్‌కు ఆయ‌న ఎన్నిక కావ‌డం ఇది రెండవ‌సారి. పీఎంఎల్‌-ఎన్ టికెట్‌పై ఆయ‌న 2013లో మైనారిటీ కింద ఎన్నిక‌య్యారు. 

సింధు ప్రావిన్సులో ఉన్న గోత్కీ జిల్లాలో ఆయ‌న వైద్య వృత్తి చేశారు. ప‌నామా కేసులో చిక్కుకున్న మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. దాంతో అబ్బాసీని ఆప‌ద్ద‌ర్మ ప్రధానిగా ఎన్నుకున్న విష‌యం తెలిసిందే.

2018లో జరుగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నవాజ్ షరీఫ్ తో పొత్తు ఏర్పర్చుకున్న  వారికి, మద్దతు దారులకు మంత్రివర్గంలో ఎక్కువగా  ప్రాధాన్యత ఇచ్చారు. మంత్రుల  సంఖ్యను కూడా రెట్టింపు చేశారు. ప్రస్తుతం సుప్రీం కోర్ట్ క్రిమినల్ నేరారోపణపై విచారణ జరుపుతున్నా ఇషాక్ దర్ తిరిగి ఆర్ధికమంత్రిగా వచ్చారు. కాగా, షరీఫ్ కు  సన్నిహితుడైన, ఇంతకుముందు  రక్షణ, ఇంధనం శాఖలను  నిర్వహించిన ఖవా అసిఫ్ ను విదేశాంగ మంత్రిగా నియమించారు.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 14 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted 20 hours ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!