హెచ్‌1బి వీసా ప్రక్రియ ప్రక్షాళన జరపాలి

Posted 6 months ago | Category : world

విదేశీయుల కోసం జారీ చేస్తున్న హెచ్‌-1బి, ఎల్‌-1 వీసా ప్రక్రియలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని, ఔట్‌సోర్సింగ్‌ కంపెనీలపై ఉక్కుపాదం మోపాలని అమెరికన్‌ కాంగ్రెస్‌కు చెందిన కొందరు సభ్యులు అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు. కొన్ని సంస్థలు హెచ్‌-1బి వీసాను దుర్వినియోగం చేస్తూ అమెరికన్‌ల స్థానంలో తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయని వారు ట్రంప్‌కు రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు.

"అధ్యక్షుడిగా మీ అధికారాన్ని ఉపయోగించి హెచ్‌-1బి వీసాల దుర్వినియోగాన్ని ఆపాలి" అని వారు కోరారు. ప్రస్తుతం అమలులో వున్న విధానాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి అందులోని లొసుగులను తొలగిస్తారని తాము భావిస్తున్నట్లు వారు ఆ లేఖలో పేర్కొన్నారు.

అమెరికన్‌ ఉద్యోగులను పరిరక్షించటం కోసం తాము ప్రతిపాదించిన హెచ్‌ఆర్‌1303, ఎస్‌ 180, హెచ్‌-1బి, ఎల్‌-1 వీసా సంస్కరణల చట్టం ఈ లొసుగులను తొలగించి వీసా విధానాలను పూర్తి ప్రక్షాళన చేస్తుందని, ఔట్‌సోర్సింగ్‌ కంపెనీలపై ఉక్కుపాదం మోపుతుందని తాము భావిస్తున్నామని వారు చెప్పారు.  కాంగ్రెస్‌ సభ్యుడు బిల్‌ పాస్‌క్రెల్‌ నేతృత్వంలో సెనేటర్‌ రిచర్డ్‌ డర్బిన్‌, కాంగ్రెస్‌ సభ్యులు దవే బ్రాత్‌, ఆర్‌ఒ ఖన్నా, పాల్‌ ఎ గోసర్‌ తదితరులు ఈ లేఖపై సంతకాలు చేశారు.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 16 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!