//single page style gallary page

ట్రంప్ H1B వీసా సంస్కరణలతో "ఇండియన్ వర్కర్స్ ఫస్ట్"

Posted a year ago | Category : world national

అమెరికా పౌరసత్వ, వలసల సర్వీసుల USCIS వెబ్ సైట్ లో "పుట్టింగ్ అమెరికన్ ఫస్ట్" అనే హెడ్ లైన్ సాక్ష్యాత్కరిస్తుంది. అంటే అమెరికాలోని ఉద్యోగాలకు ముందుగా అమెరికా పౌరులకే అర్హత వుంటుందని, ఆ తర్వాతనే విదేశీయులకు ఛాన్స్ ఉంటుందని దీని అర్ధం. మరొక హెడ్ లైన్ H1B వీసా ఫ్రాడ్ మరియు దురుపయోగాన్ని అరికట్టేందుకు కొత్త చర్యలు తీసుకుంటున్నట్లు సైట్ లో పెట్టారు. H1B వీసాపై అమెరికా వచ్చిన కంపెనీలకు కాకుండ వేరే కంపెనీల వద్ద ఆఫ్ సైట్ లో పనిచేసేవారిపై USCIS దృష్టి కేంద్రీకరించింది. ఎన్నో దేశాలనుంచి H1B వీసాలపై ఉద్యోగులు అమెరికాకు వస్తున్నా USCIS భారతీయుల పైనే గురిపెట్టింది. దీనికి కారణం లేకపోలేదు. ఐటీ నిపుణులను H1B వీసాపై అమెరికాలో నియమించే దిగ్గజ కంపెనీలు 'టాటా కన్సల్టెన్సీ', 'ఇన్ఫోసిస్', 'విప్రో' ఒక్క 2015 సంవత్సరంలోనే 70 శాతంపైగా వీసాలను స్వంతం చేసుకున్నారు. కనుక ఈ రంగంలో భారతీయ ఐటీ నిపుణుల ఆధిపత్యం కొనసాగుతోంది. 

ట్రంప్ H1B వీసా సంస్కరణలపై రేగిన దుమారం భారతీయ ఐటీ దిగ్గజాల మార్కెట్ విలువను మూడుశాతం వరకు దెబ్బకొట్టింది. కానీ భయపడాల్సిన పనిలేదు. మిలినియమ్ బగ్ సందర్భంగా మొదలైన భారతీయ ఐటీ నిపుణుల హావా ఎప్పటికీ కొనసాగనుంది. భారత ఐటీరంగం 40 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. దాంట్లో H1B విసాలపై వున్నరెండు లక్షలమంది చాల చిన్నసంఖ్యే. H1B విసాదారులు అమెరికాలో పనిచేసేదానికన్నా వారికి సపోర్టుగా మనదేశములోనే ఎక్కువ పని జరుగుతోంది. విసాలపై కొత్త సమస్యల మూలంగా ఎక్కువమందిని మనం అమెరికా పంపలేకపోవచ్చు. కానీ భారత ప్రభుత్వం ఐటీ రంగాన్ని ఎంతో కొత్త వసతులు, రాయితీలు ప్రకటించింది. మన కంపెనీలకు,విదేశీ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరిచింది. మన ఐటీ నైపుణ్యంపై ఆధారపడే విదేశీ కంపెనీలు మన దేశంలో కొత్త సంస్థలు స్థాపించి మరిన్ని ఉద్యోగాలు ఇక్కడ సృష్టించనున్నారు. అంటే నా పుంజు కూయకపోతే ఎవరికీ తెల్లవరదనుకుంటున్న ట్రంపుప్రభుత్వం అనుకోకుండా "ఇండియన్ వర్కర్స్ ఫస్ట్" అన్నట్లు అయ్యింది. 


నేడు జగన్నాథుని రథయాత్ర.. జై జగన్నాథ నామస్మరణతో మార్మోగుతు ఆలయాలు...!

Posted 2 days ago | Category : state national editorial

నేడు జగన్నాథుని రథయాత్ర.. జై జగన్నాథ నామస్మరణతో మార్మోగుతు ఆలయాలు...!

వాట్సాప్ వాడకంపై నిఘా పెట్టనున్న..సుప్రీంకోర్టు....

Posted 2 days ago | Category : world technology

వాట్సాప్ వాడకంపై నిఘా పెట్టనున్న..సుప్రీంకోర్టు....

లాంగ్‌ లాచీ అంటూ డాన్స్ చేసిన కుర్రాడు.......నెట్ లో హల్ చల్....!

Posted 2 days ago | Category : national movies

లాంగ్‌ లాచీ అంటూ డాన్స్ చేసిన కుర్రాడు.......నెట్ లో హల్ చల్....!

రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు...!

Posted 2 days ago | Category : politics national

రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా  అమెరికా అధ్యక్షుడు...!

ఎన్‌డీ తివారీ పరిస్థితి విషమం

Posted 4 days ago | Category : national politics

ఎన్‌డీ తివారీ పరిస్థితి విషమం

ఉరికి సై అన్న...సుప్రీం..

Posted 6 days ago | Category : national state

ఉరికి సై అన్న...సుప్రీం..

భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు మృతి

Posted 7 days ago | Category : national

భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు మృతి

అమెరికాలో తెలుగు విద్యార్థి హత్య ..!

Posted 8 days ago | Category : national

అమెరికాలో తెలుగు విద్యార్థి హత్య ..!

ముంబయిలో మరో వంతెనకు పగుళ్లు.. అప్రమత్తమైన పోలీసులు , ట్రాఫిక్‌ మళ్లింపు

Posted 11 days ago | Category : national

ముంబయిలో మరో వంతెనకు పగుళ్లు.. అప్రమత్తమైన పోలీసులు , ట్రాఫిక్‌ మళ్లింపు

కైలాస్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం

Posted 13 days ago | Category : world

కైలాస్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం

అమర్‌నాథ్ యాత్రకు అంతరాయం...

Posted 13 days ago | Category : world

అమర్‌నాథ్ యాత్రకు అంతరాయం...