ట్రంప్ నిర్ణయాలతో స్వదేశాలకు మేలు జరుగనుందా..?

Posted 9 months ago | Category : world

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B చట్టంలో మార్పులు చేస్తూ, వీసా పొందే మార్గాలను కఠినతరం చేస్తున్నాడు. H1B వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తూ, అమెరికన్ల ఉద్యోగాలకు గండికొడుతున్నారని ట్రంప్ వాదన. 'బై అమెరికన్ హైర్ అమెరికన్' అనే నినాదం చేస్తూ, అత్యధిక వేతనం, అత్యధిక నైపుణ్యం ఉన్నవారే H1B వీసా పొందేలా నిబందనలను రూపొందించాలని ఒక కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీచేశాడు ట్రంప్.

కానీ H1B వీసా కార్యక్రమం వలన అమెరికాకే నష్టం అని కొందరి నిపుణుల వాదన. H1B వీసా పొందేందుకు కంపెనీలు అధిక రుసుములు చెల్లిస్తారు కనుక మంచి నైపుణ్యం ఉన్న వారిని ఉద్యోగాల్లో నియమించుకునేందుకు యాజమాన్యాలు ప్రయత్నిస్తాయన్నారు. నిజానికి ఆ ఉద్యోగానికి సరైన నైపుణ్యం ఉన్న అమెరికన్లు అందుబాటులో లేనప్పుడు, వేదేశీయులవైపు కంపెనీలు చూస్తాయని కొందరి వాదనైతే, మరికొందరు అమెరికన్ల స్థానంలో విదేశీయులను నియమిస్తున్నారని వాదిస్తున్నారు.

వాస్తవానికి అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించేవారిలో 60% విదేశీయులే. వారిలో అధికశాతం అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. ఈ విదేశీ ఉద్యోగులందరు అమెరికా ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుస్తారు. ఇప్పుడు వారిని దేశం నుండి పంపిస్తే మనకు పోటీదారులవుతారని వాదిస్తున్నారు. ఎందుకంటే వీరిలో అధిక శాతం అమెరికాలో చదువుకొని, శిక్షణ పొందిన వారు కావటంతో ఈ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు ఎక్కువ అని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు ఎరిక్ పాల్ సెల్ అన్నాడు.

ఇది ఇలా వుంటే ట్రంప్ దెబ్బకు స్వదేశంలో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. 2016 డిసెంబర్ లో అమెరికాలో ఉండే భారతీయులు 600 మంది స్వదేశములో ఉద్యోగం కోసం ప్రయత్నించగా ఇప్పుడు అది 7 వేలకు చేరుకుందని కన్సల్టింగ్ సంస్థ 'డియోలైట్' తెలిపింది. వీసా సంస్కరణల వలన స్వదేశీ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఏర్పడనుంది.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted a day ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!