ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

డల్లాస్ లో కాల్పుల కలకలం 8 మంది మృతి

Posted 2 months ago world

ఓవైపు వరదలు, భయంకరమైన తుపానులతో చిగురుటాకులా వణికిపోతున్న అమెరికాలో మరోవైపు కాల్పులతో రక్తపాతం సృష్టించాడు ఓ దుండగుడు. టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ సబర్బన్‌ ప్లానో ప్రాంతంలో ఆదివారం రాత్రి ఓ ఇంట్లోకి చొరబడిన దుండగుడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకి తెగబడ్డాడు. దుండగుడు జరిపిన కాల్పుల్లో మొత్తం ఏడుగురు చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహటిన ఘటనాస్థలానికి చేరుకుని కాల్పులకి పాల్పడిన దుండగుడిని కాల్చిచంపారు.

దీంతో దుండగుడు సహా ఈ ఘటనలో మృతిచెందిన వారి మొత్తం సంఖ్య 8కి చేరింది. దుండగుడికి, అతడి చేతిలో ప్రాణాలు కోల్పోయిన బాధితులకి మధ్య వున్న సంబంధం ఏంటి ? ఎందుకు దుండగుడు వారిని కాల్చిచంపాడు అనే వివరాలపై ప్రస్తుతానికి పోలీసుల వద్ద ఎటువంటి సమాచారం లేదు.ప్లానో పోలీసు డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి డేవిడ్ టిల్లీ ఈ దుర్ఘటనపై స్పందిస్తూ ఘటనాస్థలానికి మొదట చేరుకున్న పోలీసు అధికారికి, నిందితుడికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నిందితుడు మృతి చెందినట్టు తెలిపారు.

Most Read