ఇజ్రాయెల్‌లో నరేంద్ర మోడీకి అఖండ స్వాగతం

Posted 8 months ago | Category : world

ఇజ్రాయెల్‌లో పాదం మోపిన తొలిభారత ప్రధాని నరేంద్ర మోడీకి అఖండ స్వాగతం లభించింది. ప్రొటోకాల్‌ను కాదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు విమానాశ్రయానికి మంత్రిమండలితో సహా తరలి వచ్చి అపూర్వమైన రీతిలో నరేంద్రమోడీకి స్వాగత సత్కారాలు జరిపారు. ఆప్‌కా స్వాగత్ హై మెరే దోస్త్ అంటూ హిందీలో స్వాగత వచనాలు పలికి ఆశ్చర్యచకితులను చేశారు. నరేంద్రమోడీ గొప్ప విశ్వనేత అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. ఓ ఇజ్రాయెలీ పుష్పానికి మోదీ పేరు పెట్టి గౌరవాన్ని చాటుకున్నారు

ఇజ్రాయెల్ ప్రధాని విమానాశ్రయానికి వచ్చి విదేశీ ప్రముఖుల్ని ఆహ్వానించడం చాలా అరుదుగా జరిగే పరిణామం. ఇప్పటి వరకూ అమెరికా అధ్యక్షుడికి, పోప్‌కే ఈ గౌరవం దక్కింది. అలాంటి అరుదైన గౌరవాన్ని మోడీకి అందించిన నెతన్యాహూ ‘మీ పర్యటన చారిత్రకం. మేము భారత్‌ను ప్రేమిస్తున్నాం. అభిమానిస్తున్నాం. భారత్‌కే కాదు ప్రపంచానికే గొప్ప నాయకులు మీరు’ అని అన్నారు. 

గత ఏడు దశాబ్దాలుగా భారత ప్రధాని ఎప్పుడు వస్తారా? అంటూ ఎదురుచూస్తూనే ఉన్నామని ఉద్వేగంగా అన్నారు. మూడుసార్లు పరస్పరం అక్కున చేర్చుకున్న ఇరు దేశాల ప్రధానులు ‘మై ఫ్రండ్’ అంటూ పలుమార్లు సంబోధించుకున్నారు. అక్కడికక్కడ జరిగిన స్వల్ప సమావేశంలో మాట్లాడుతూ, ద్వైపాక్షిక సంబంధాలను అన్ని కోణాల్లోనూ విస్తరించుకుంటామని, ఉమ్మడి శత్రువైన ఉగ్రవాదాన్ని సంయుక్తంగా ఎదుర్కొంటామని ప్రతిజ్ఞ చేశారు. 

కాగా రెండు దేశాల చారిత్రక బంధాలకు తన పర్యటన కొత్తబాట వేస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు జరుపుదామని పిలుపునిచ్చారు. ద్వైపాక్షిక బంధాన్ని సమున్నత శిఖరాలకు తీసుకువెళ్తామని ఉభయనేతలు ప్రకటించారు. 

భారత్- ఇజ్రాయెల్ మైత్రికి సంబంధించినంత వరకూ ఆకాశమే హద్దని గతంలో తాను పేర్కొన్నానని గుర్తు చేసుకున్న నెతన్యాహు ‘ఇప్పుడు ఆకాశం కూడా హద్దు కాదు’ అన్న మాటను చేరుస్తున్నానని మోడీనుద్దేశించి నెతన్యాహు అన్నారు. రెండు దేశాలు అన్ని రంగాల్లోనూ పరస్పరం సహకరించుకోవడానికి ఎన్నో అవకాశాలున్నాయని, మరింతగా ఈ బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చునని తెలిపారు. ఇరు దేశాల జాతీయగీతాలతో సాగిన సైనిక వందనాన్ని మోడీ స్వీకరించారు. 


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 6 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!