//single page style gallary page

మెట్రో ప్రయాణికులకు మరో శుభవార్త.

Posted 6 months ago | Category : state

మెట్రో రైలుకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో నిర్మాణ పనులను జూన్‌ ఒకటి నాటికి పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని మెట్రో అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. అమీర్‌పేట-హైటెక్‌ సిటీ మార్గంపై ప్రత్యేక శ్రద్ధచూపాలన్నారు.

బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన మెట్రో సమీక్షా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. మెట్రో రైలుకు భారీస్పందన వస్తున్న నేపథ్యంలో రైళ్ల సంఖ్యను పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించగా వచ్చే ఫిబ్రవరి నాటికి ప్రయాణి కుల సంఖ్యను బట్టి రైళ్ల సంఖ్యను పెంచుతామని మెట్రో అధికారులు తెలిపారు. మెట్రోస్టేషన్లలో పార్కింగ్‌ సౌకర్యాలు కల్పించాలని,ఇప్పటికే ఉన్న పార్కింగ్‌ స్థలాలు ప్రజలకు తెలిసేలా చర్యలు చేపట్టాలని, మెట్రోభద్రత కోసం పోలీసు శాఖ సహకారం తీసుకోవాలని మంత్రి సూచించారు.

మెట్రో ఫీడర్ల రూట్లలో మరిన్ని బస్సులు నడిపేలా ఆర్టీసీతో చర్చించాలన్నారు. స్టేషన్లలో తాగునీరు, మూత్రశాలల ఏర్పాటుపై త్వరగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం పరిమితంగా ఉన్న మూత్రశాలలకు అదనంగా మరిన్ని నిర్మించాలన్నారు. మెట్రో కారిడార్లలో ఫుట్‌పాత్‌ల ఆధునీకరణ పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు కేటీఆర్‌ ప్రత్యేకంగా సూచించారు. స్మార్ట్‌ కార్డుల వినియోగం, ప్రయోజనాలు ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ప్రయాణికుల నుంచి ప్రతిస్పందన ఎలా ఉందని అధికారులను కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు.


ఎమ్మెల్యేగా పోటి చెయ్యనని చెప్పిన ఎంపి

Posted 2 hours ago | Category : state politics

ఎమ్మెల్యేగా పోటి చెయ్యనని చెప్పిన ఎంపి

చంద్రబాబుపై అమిత్ షా కామెంట్స్

Posted 2 hours ago | Category : state politics

చంద్రబాబుపై అమిత్ షా కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ కి మరో అంతర్జాతీయ సంస్థ

Posted 2 hours ago | Category : state politics

ఆంధ్రప్రదేశ్ కి మరో అంతర్జాతీయ సంస్థ

మహానాడులో కార్యకర్తల కోసం...ఫుడ్ మెనూ

Posted 2 hours ago | Category : state politics

మహానాడులో కార్యకర్తల కోసం...ఫుడ్ మెనూ

పవన్ దీనికి సమాధానం చెప్తావా..?

Posted 2 hours ago | Category : state politics

పవన్ దీనికి సమాధానం చెప్తావా..?

జనాల జేబులు కాళి చేసిన వాట్సాప్

Posted a day ago | Category : state national world

జనాల జేబులు కాళి చేసిన వాట్సాప్

భారత్ లో ఇంటర్నెట్ ఎంత మంది వాడుతున్నారో తెలుసా..?

Posted 2 days ago | Category : national state technology

భారత్ లో ఇంటర్నెట్ ఎంత మంది వాడుతున్నారో తెలుసా..?

తెలియకుండా గర్భవతిని చేసారు

Posted 2 days ago | Category : state

తెలియకుండా గర్భవతిని చేసారు

జగన్ పార్టీకి షాక్

Posted 3 days ago | Category : state politics

జగన్ పార్టీకి షాక్

జగన్ పవన్ అంతర్గత పొత్తు

Posted 4 days ago | Category : politics state

జగన్ పవన్ అంతర్గత పొత్తు

ప్రముఖ నవలా రచయిత్రి......యద్దనపూడి సులోచనారాణి మృతి...!

Posted 5 days ago | Category : national state

ప్రముఖ నవలా రచయిత్రి......యద్దనపూడి సులోచనారాణి మృతి...!