అంటార్కిటికాలో భారీ మంచుకొండకు చీలిక

Posted 8 months ago | Category : world

అంటర్కిటికా ఖండంలో ఉన్న ఐదు వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఓ భారీ మంచుకొండకు చీలిక ఏర్పడిందని, ఒకవేళ అది విడిపోతే పడవలకు ఇబ్బందులు తప్పవని శాస్త్రవేత్తలు బుధవారం వెల్లడించారు. అమెరికాలోని డెలావేర్ రాష్ట్రం లేదా ఇండోనేషియాలోని బాలీ ద్వీపం అంత పెద్దగా ఉండే లార్సెన్ సీ మంచు పలక నుంచి ఓ భాగం విడిపోతున్నదని తెలిపారు. 175 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ మంచు పలక నుంచి 13 కిలోమీటర్ల మేర ఉన్న భాగానికి మధ్య పగులు ఏర్పడింది. ఈ పరిస్థితి మమ్మల్ని అయోమయానికి గురి చేసిందని బ్రిటీష్ అంటార్కిటిక్ సర్వేకు చెందిన అండ్రూ ఫ్లెమింగ్ పేర్కొన్నారు. ఇది చిన్నపిల్లల ఊడిపోయే దంతం మాదిరిగా నానాటికీ వదులు అవుతున్నదని వివరించారు.

200 మీటర్ల మందంతో ఉండే ఈ మంచు పలక సముద్ర మట్టం నుంచి 20 మీటర్ల ఎత్తు ఉంటుంది. అంటార్కిటికాలో భారీ మంచు కొండలు వీడిపోవడం అనేది సర్వసాధారణంగా జరిగే పరిణామమే. మానవ తప్పిదాల వల్ల ఏర్పడుతున్న వాతావరణ మార్పులకు దీనికి సంబంధం ఉన్నదని శాస్త్రవ్తేతలు స్పష్టంగా పేర్కొనకపోయినా ఇటీవల కాలంలో అంటార్కిటికాలో మంచు వేగంగా కరిగిపోతున్నదనే వార్తల నేపథ్యంలో ఈ పరిణామం ఆందోళన కలిగిస్తున్నది.మంచుకొండ విడిపోవడానికి ఇతర కారణాలేవీ లేవని, ఇది మళ్లీ పెరిగే అవకాశం కూడా ఉంటుందని వేల్స్‌లోని స్వాన్సీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆడ్రియన్ లాక్మాన్ పేర్కొన్నారు. అయితే ఇది విడివడటానికి కొన్ని నెలలు లేదా కొన్ని ఏండ్లు పట్టవచ్చని లాక్మాన్ ఆధ్వర్యంలోని బృందం తెలిపింది.


టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 2 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 3 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 3 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 3 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 4 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 5 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 5 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 9 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 10 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

Posted 10 days ago | Category : world

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

Posted 10 days ago | Category : world

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!