మరింతగా పెరగనున్న అహారోత్పత్తుల ధరలు

Posted 6 months ago | Category : business

వచ్చే మాసాల్లోవచ్చే మాసాల్లో అహారోత్పత్తుల ధరలు ద్రవ్యోల్బణ సూచీలకు మరింత ఆజ్యం పోయనున్నాయని తాజాగా మోర్గన్‌ స్టాన్లే ఒక రిపోర్టులో వెల్లడించింది. ఈ గ్లోబల్‌ ఫైనాన్సీయల్‌ సర్వీసెస్‌ సంస్థ నివేదిక ప్రకారం ఇప్పటికే జూన్‌, జులైలో ధరలు పెరిగాయి. భవిష్యత్‌ మాసాల్లో ఈ ధరలు మరింత పెరగనున్నాయి. ప్రస్తుత ఏడాది జులైలో టోకు ద్రవ్యోల్బణం సూచీ 1.88 శాతానికి ఎగిసింది. ఇంతక్రితం జూన్‌ మాసంలో ఇది 0.90 శాతంగా చోటు చేసుకుంది.

ప్రధానంగా అహారోత్పత్తులు, కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. క్రితం మాసంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచీ 2.36 శాతానికి పెరిగింది. చక్కెర, కన్‌ఫెక్షణరీ ఉత్పత్తులు, పాన్‌, పొగాకు తదితర ఉత్పత్తుల ధరలు ఎగిశాయి.ప్రస్తుత ఆగస్టులో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ), టోకు ద్రవ్యోల్బణం సూచీ వరుసగా 3 శాతం, 2.1 శాతానికి పెరుగొచ్చని మోర్గాన్‌ స్టాన్లే తన పరిశోధన నివేదికలో పేర్కొంది.

ఆగస్టు తొలి వారంలో జరిగిన రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భవిష్యత్తులో కొంత ద్రవ్యోల్బణం సూచీ దిగిరావచ్చని, దీంతో వడ్డీ రేట్లు తగ్గడానికి మరింత అవకాశం ఉందని సెంట్రల్‌ బ్యాంకు అంచనా వేసింది. వరుసగా మళ్లీ ధరలు పెరిగితే ఇక వడ్డీ రేట్ల కోతకు అవకాశం ఉండకపోవచ్చని మోర్గాన్‌ స్టాన్లే పేర్కొంది. అక్టోబర్‌లో జరగనున్న ఆర్‌బిఐ పరపతి సమీక్షలో ఆగస్టు, సెప్టెంబర్‌ వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీలను కీలకంగా తీసుకోనుందని తెలిపింది.

దేశీయంగా రానున్న రోజుల్లో ధరలు పెరిగే అవకాశం లేకపోలేదని రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌ఐ) 'ద్రవ్య పరపతి విధాన కమిటీ'  సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.   రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం క్రమంగా పెరిగే అవకాశం లేకపోలేదని హెచ్చరికలు జారి చేసింది. ద్రవ్యోల్బణం మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున ఇక కొత్తగా వడ్డీరేట్లలో కోత విషయం అటుంచి, ఇప్పటికే తగ్గించిన వడ్డీ రేట్లు ప్రజలకు చేరేలా వాణిజ్య బ్యాంకులు తగిన చర్యలు చేపట్టేలని భావిస్తున్నారు.


పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

Posted 7 days ago | Category : business

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

Posted 8 days ago | Category : business

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

Posted 8 days ago | Category : business

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

Posted 9 days ago | Category : business

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

Posted 11 days ago | Category : business

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Posted 11 days ago | Category : business

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్ సర్ జి..!

Posted 15 days ago | Category : business

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్  సర్ జి..!

లాభాలలో ఆపిల్ సంస్థ......!

Posted 15 days ago | Category : business

లాభాలలో ఆపిల్ సంస్థ......!

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

Posted 16 days ago | Category : business

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

Posted 16 days ago | Category : business

 ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

సరికొత్త షార్ట్ థియేటర్..!

Posted 16 days ago | Category : business

సరికొత్త షార్ట్ థియేటర్..!