ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

వియత్నాంలో వరదలు.. 43 మంది మృతి

Posted a month ago world

హనోయ్, వియత్నాంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో గురువారం తెల్లవారుజామున సుడిగాలులతో కూడిన తుఫాను ముంచెత్తింది. వరదలతోపాటు కొండచరియలు విరిగిపడటంతో 43 మంది చనిపోయారు. మరో 34 మందికిపైగా గల్లంతయ్యారు. వియత్నాం ఉత్తర, మధ్య ప్రాంతంలోని ఆరు రాష్ర్టాల్లో పంటలు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు.

వెయ్యికిపైగా ఇండ్లు దెబ్బతిన్నాయని, 16,700 ఇండ్లు నీట మునిగాయని, మౌలిక సదుపాయాలకు తీవ్రనష్టం జరిగిందని విపత్తుల నిర్వహణాసంస్థ వెల్లడించింది. హోవాబిన్ రాష్ట్రంలో నష్టం ఎక్కువగా జరిగింది. అక్కడ 17 మంది మృతి చెందగా, 15 మంది జాడ తెలియకుండా పోయారు. కొండచరియలు విరిగిపడటంతో నాలుగు కుటుంబాలవారు నిద్రలోనే మరణించారు. 250 మందికి పైగా సైనికులు, భద్రతా సిబ్బంది, ప్రజల సాయంతో సహాయచర్యలు చేపట్టారు. నిన్‌బన్ ప్రావిన్స్‌లో రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Most Read