రాజ్యసభలో మొదటిసారిగా బీజేపీకి ఆధిక్యత

Posted 6 months ago | Category : politics

స్వతంత్ర భారత దేశ చరిత్రలో మొదటి సారిగా కాంగ్రెస్ పార్టీ కాకుండా మరో పార్టీ ఏకైక పెద్ద పార్టీగా రాజ్యసభలో ఇప్పుడు నిలిచింది. ఆ గౌరవం కేంద్రములో అధికారంలో ఉన్న బీజేపీకి దక్కింది. కేంద్రములో అధికారంలో లేని సమయంలో కూడా మొదటి నుండి రాజ్యసభలో కాంగ్రెస్ కు ఇతర పార్టీల కన్నా ఎక్కువమంది సభ్యులు ఉంటూ వస్తున్నారు.

నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి పదవి చేపట్టి మూడేళ్లు దాటినా ఇప్పటి వరకు కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ కు రాజ్యసభ లో ఆధిక్యత ఉంటూ ఉండడంతో కీలకమైన పలు బిల్లుల ఆమోదం పొందటం కష్టంగా మారింది. క్రమంగా కాంగ్రెస్ సభ్యులు తగ్గుతూ ఉండటం, బీజేపీ బలం పెరుగుతూ ఉండడంతో ఇప్పుడు  ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌ను మించి స‌భ్యులు బీజేపీకి ఉన్నారు. కాంగ్రెస్‌కు 57 మంది ఉండ‌గా, బీజేపీకి 58 మంది స‌భ్యులు ఉన్నారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి రాజ్య‌స‌భ‌కు వ‌చ్చిన బీజేపీ ఎంపీ సంప‌తియా గురువారం ప్ర‌మాణ స్వీకారం చేయడంతో కాంగ్రెస్ సభ్యుల సంఖ్యకు మించి బీజేపీకి ఎక్కువగా ఒక సభ్యుడు చేరినట్లు అయింది.  కేంద్ర మంత్రి అనిల్ మాధ‌వ్ ద‌వే మృతితో జరిగిన ఉప ఎన్నికలో సంప‌తియా ఎన్నిక అయ్యారు.  2014లో మోదీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన త‌ర్వాత తొలిసారి రాజ్య‌స‌భ‌లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించింది.

 అయినా  ఇప్ప‌టికీ బీజేపీకి గాని, ఆ పార్టీ నాయకత్వంలోని ఎన్డీయే కు గాని సొంతంగా మెజారిటీ లేదు. బిల్లుల ఆమోదం కోసం పలు ప్రాంతీయ పార్టీల మద్దతుపై ఆధార పడవలసి ఉంటుంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ మ‌రో ప‌ది మంది స‌భ్యుల‌ను రాజ్య‌స‌భ‌లో కోల్పోనుండ‌గా,  బీజేపీ బ‌లం 70కి పెర‌గ‌నుంది.

నితీష్ కుమార్ బీజేపీకి తో కలవడంతో, ఆ పార్టీకి రాజ్యసభలో 10 మంది సభ్యులు ఉన్నారు. అన్నా డీయంకె ఎన్డీయే లో చేరితే మరో 13 మంది సభ్యులు చేరినట్లు కాగలదు. ఇక వెంక‌య్య‌నాయుడు ఉప రాష్ట్ర‌ప‌తి అయితే రాజ్య‌స‌భ చైర్మ‌న్‌గా ఆయ‌న సార‌థ్యంలో వ్య‌వ‌హారాలు మ‌రింత సాఫీగా సాగిపోతాయ‌ని బీజేపీ భావిస్తున్న‌ది. ఉప రాష్ట్ర‌ప‌తికి రాజ్య‌స‌భ ఎక్స్ అఫిషియో చైర్మ‌న్ హోదా ఉంటుంది. 


ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted a day ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted a day ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted a day ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 2 days ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 2 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 2 days ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 2 days ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 2 days ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!