ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ఎట్టకేలకు జయ మృతిపై విచారణ

Posted 4 months ago politics

నాటకీయ పరిణామాల మధ్య తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై న్యాయ విచారణకు ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదేశించారు. 

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరుసెల్వం ర్గాలు ఒక్కటయ్యేందుకు మరో ముందడుగు పడింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తూ పళనిస్వామి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌ ఏర్పాటుచేసినట్టు ఆయన ప్రకటించారు. 

ఈ చర్యలతో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా  పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్‌ వర్గాలు ఒక్కటయ్యేందుకు మరో ముందడుగు పడినట్లయింది. పోయిస్‌ గార్డెన్‌లోని వేద నిలయాన్ని ప్రభుత్వ స్మారక కేంద్రంగా మారుస్తామని కూడా ఈ సందర్భంగా  స్పష్టంచేశారు. 

వేద నిలయం ప్రస్తుతం శశికళ ఆదీనంలోనే ఉన్నందున ముఖ్యమంత్రి  తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అన్నాడీఎంకే పార్టీలోని చీలికవర్గాలు ఒక్కటయ్యే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నవేళ ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

దీర్ఘకాల అనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ జయలలిత గతేడాది డిసెంబర్‌లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆమె మరణానంతరం పార్టీలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. జయలలిత మరణం తర్వాత ఆమె అత్యంత నమ్మకస్తుడు పన్నీర్‌ సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే అమ్మ మృతితో పార్టీ పగ్గాలు చేపట్టిన ఆమె నెచ్చెలి శశికళ పన్నీర్‌ను తప్పించి తాను సీఎం కావాలని ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పార్టీ రెండుగా చీలిపోయింది.

అయితే అక్రమాస్తుల కేసులో శశికళ దోషిగా తేలడంతో ఆమె సీఎం ఆశలు గల్లంతయ్యాయి. దీంతో పళనిస్వామిని సీఎంను చేసి శశికళ జైలుకెళ్లారు. అయితే పార్టీ నుంచి వీడిపోయిన పన్నీర్‌ సెల్వం జయలలిత మృతిపై తనకు అనుమానాలున్నాయని ఆరోపించారు.  దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన వర్గం డిమాండ్‌ చేసింది.

కాగా తమిళనాడులో పాగా వేయడం కోసం అవకాశాలు వేడుకొంటున్న బీజేపీ కి అధికార పర్యటలో నెలకొన్న సంక్షోభం కలసి వచ్చిన అవకాశంగా అనిపించింది. దానితో నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ రెండు వర్గాల నాయకులతో మంతనాలు జరిపి, వారి విలీనం కోసం భూమిక ఏర్పాటు చేశారు. విలీనం జరుగగానే ముగ్గురిని కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. ప్రధానిని కలసిన తర్వాతనే రెండు వర్గాలు విలీన పక్రియను వేగవంతం చేస్తున్నట్లు కనిపిస్తున్నది. 

Related Articles

Most Read