ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

మధ్యప్రదేశ్ లో రైతుల ఆందోళన ఉధృతం, రాహుల్ కు అనుమతి నిరాకరణ

Posted 6 months ago national politics

మధ్య ప్రదేశ్ లో మంగళవారం జరిగిన పోలీస్ కాల్పులలో మృతిచెందిన ఆరుగురు  రైతుల కుటుంబాలను పరామర్శించడానికి  మాండసౌర్‌ ప్రాంతంలో పర్యటించేందుకు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి పోలీస్ లు అనుమతి నిరాకరించారు. ప్రస్తుతం మాండసౌర్‌లో పరిస్థితులు సక్రమంగా లేని కారణంగా అధికారులు రాహుల్‌ పర్యటించేందుకు అనుమతివ్వలేదు. ఈ మధ్యనే ఘర్షణ వాతావరణ నెలకొన్న ఉత్తర ప్రదేశ్ లోని షహరాన్‌పూర్‌లో పర్యటించేందుకు కూడా రాహుల్‌ను అనుమతించలేదు.

మాండసౌర్‌ మాజీ యంపీ, కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రైతులను కలుసుకోవడానికి వెడుతుండగా పోలీస్ లు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.  అసలు పోలీసులు కాల్పులు జరపలేదని, ఎవరు కాల్పులు జరిపారనే దానిపై విచారణ చేస్తున్నట్లు నిన్న ప్రకటించిన రాష్ట్ర హోంమంత్రి భూపేంద్ర సింగ్‌ ఈ రోజు మాట మార్చారు.  ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపి ఉండవచ్చని అన్నారు. 

కాగా, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున సహాయాన్ని ముఖ్యమంత్రి  శివరాజ్ సింగ్ చౌహన్ ప్రకటించారు. వారి కుటుంభం సభ్యులలో ఒకరికి ఉద్యోగం కలిపిస్తారు. కాగా గాయపడిన వారికి వైద్య సహాయంతో పాటు రూ 5 లక్షల సహాయం ప్రకటించారు. ఉల్లి, పప్పు ధాన్యాలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గత వారం రోజులుగా రైతులు ఆందోళనబాట పట్టారు. 

ఇలా ఉండగా, బుధవారం ఆందోళనకారుల నిరసన తారాస్థాయికి చేరింది. వారితో మాట్లాడి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు వెళ్లిన మాండసౌర్‌ జిల్లా కలెక్టర్‌ ను రైతులు అడ్డుకున్నారు. ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. రహదారులపై కనిపించిన వాహనాలకు నిప్పు పెట్టారు. దాదాపు ఎనిమిది నుంచి పది వాహనాల వరకు కాలిపోయాయి. 

పుకార్లు వ్యాపించి మరింత అల్లర్లు జరగకుండా ఉండేందుకు అధికారులు ముందస్తుగా మొబైల్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను నిలిపివేశారు. రత్లం, నీముచ్‌, మాండసౌర్‌, ఉజ్జయిని ప్రాంతాల్లో శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు డేటా సేవలను నిలిపివేశామని, తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు సేవలు పునరుద్ధరించమని అధికారులు తెలిపారు.

Related Articles

Most Read