ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

తెలుగువారు ఒక్కొక్కరు ఒక్కో బాహుబలి కావాలి

Posted 7 months ago world

తెలుగువారు ఒక్కొక్కరు ఒక్కో బాహుబలి కావాలని, తెలుగుజాతి ప్రపంచానికే ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఇవాళ ప్రపంచం మొత్తం ఎక్కడా చూసినా తెలుగువాళ్లు ఉన్నారని, తెలుగు జాతికి కష్టపడే తత్వం, ఎక్కడైనా పనిచేయగల సామర్ధ్యం వుందని అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా నాలుగో రోజు శాన్‌హోజ్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి అక్కడ ప్రవాస తెలుగువారి సమావేశంలో ప్రసంగించారు. అమెరికాలో ఇంతమంది తెలుగువారిని చూస్తుంటే అమరావతిలో ఉన్నానో, అమెరికాలో ఉన్నానో తెలియడం లేదని ముఖ్యమంత్రి సరదాగా సంభాషించారు. ప్రపంచాన్ని జయించవచ్చని తెలుగువాళ్లు నిరూపించారని, తెలుగు జాతికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. తెలుగు బిడ్డ రాజమౌళి బాహబలి వంటి బ్రహ్మాండమైన సినిమా తీశారని, ప్రపంచం మొత్తం 9 వేల థియోటర్లలో సినిమాను పదర్శించడం గర్వకారణమని, రాజమౌళిని చూస్తే తెలుగువాడి సత్తా తెలుస్తోందని అన్నారు.

ప్రతి తెలుగువారు కొత్తగా ఆలోచించి నూతన ఆవిష్కరణలు చేయాలని, ఉక్కు సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని పిలుపునిచ్చారు. నిజాం చార్మినార్ కట్టిస్తే, ఎన్టీఆర్ బుద్దుడి విగ్రహం పెట్టించారని, తాను హైటెక్ సిటీ నిర్మించానని ముఖ్యమంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చరిత్రలో కొన్ని ఇబ్బందులు వచ్చాయని, రాజధానులు మారుతూ వచ్చామని, విభజన కొత్త సమస్యలు తెచ్చి పెట్టిందని అన్నారు. కష్టాలు తాత్కాలికమే అన్న ముఖ్యమంత్రి వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం, సహజ వనరులు, సృజనశీలురైన మానవ వనరులు మన సొంతమన్నారు. ఒంగోలు గిత్తలు మన బలం-కూచిపూడి మన ఘన వారసత్వంగా చెప్పారు.

ప్రపంచంలోని ఐదు అత్యున్నత నగరాల్లో అమరావతి ఒకటిగా ఉండేలా, ప్రపంచమే గర్వపడేలా అమరావతి రాజధాని నిర్మాణం చేసుకోవాల్సి వుందని అన్నారు. 2050కి కాలిఫోర్నియాతో పోటీ పడే అమరావతి రూపుదాల్చడం తథ్యమని చెప్పారు.

Most Read