//single page style gallary page

రెండు వారాలైనా పత్తాలేని వే బిల్లులు

Posted a year ago | Category : business

జిఎస్టీ అమలులోకి వచ్చి రెండు వారాలైనా ఇంతవరకు అంతర్రాష్ట్ర సరుకుల రవాణాకు అవసరమైన  వే బిల్లు నమూనా కేంద్రం ఇంత వరకు ఖరారు చేయక పోవడం, ఈ లోగా రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లను తీసివేయడంతో జోరుగా అక్రమ వ్యాపారం జరుగుతున్నది. తనిఖీలు దాదాపు నిలిచిపోవడంతో అవకాశంగా తీసుకున్న పలువురు పొరుగు రాష్ట్రాల్లోని ఉత్పత్తి కేంద్రాల నుండి బిల్లులు లేకుండానో, నామమాత్రపు బిల్లులతోనో సరకులు తీసుకువస్తున్నారు. 

తాము పన్ను చెల్లిరచకపోయినా జిఎస్టీని మాత్రం వినియోగదారుల వద్ద వసూలు చేసేస్తున్నారు. అధికారులు ఈ అక్రమాలను అడ్డుకోకపోగా, అందివచ్చిన అవకాశంతో అడపాదడపా దాడుల పేరిట కొరదరు జేబులు నింపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చాలాకాలంగా కొనసాగుతున్న జీరో బిజినెస్‌ ఇప్పుడు జోరందుకుంది.  

వే బిల్లులు లేకుండానే పెద్ద మొత్తంలో సరుకు సరిహద్దులు దాటుతోంది. ఉత్పత్తిదారులు తమ బిల్లులను మాత్రమే ఇచ్చి సరుకు రవాణా చేస్తున్నారు. మధ్యలో తనిఖీలు జరిగితే ఆ బిల్లుల వివరాలు రికార్డుల్లో నమోదు చేయడం, లేకుంటే ఆ బిల్లులను చించి వేస్తున్నారు. 

ఇందువల్ల చిన్న చిన్న వ్యాపారులు, ఉత్పత్తిదారులు ఎక్కువగా నష్టపోతున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నురచి అనేక వస్తువులు బిల్లులు లేకుండానే విజయవాడ, ఏపీ లోని ఇతర ప్రారతాలకు తరలివస్తున్నాయి. వీటిలో వేటికీ వే బిల్లులు ఉండటం లేదు. మార్గ మధ్యంలో ఎక్కడా తనిఖీలూ లేవు. ఫలితంగా సరుకులు యథేచ్ఛగా సరిహద్దులు దాటేస్తున్నాయి. 

దీంతో జిఎస్టీతో విక్రయించాల్సిన ధరల కన్నా, 20 శాతం తక్కువ ధరకు ఆ సరుకులు లభిస్తూ ఉండడంతో స్థానికంగా చిన్న ఉత్పత్తిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. అక్రమంగా వచ్చిన సరుకులకూ కొందరు జిఎస్టీని వర్తింపజేస్తూ అమ్మకాలు చేసేస్తున్నారు. ఆ విక్రయాలు చేసే వినియోగదారులకు బిల్లులు ఇవ్వకుండా అదనపు లాభాలు ఆర్జిస్తున్నారు. 

ఐకీయా వెనక ఉన్న అసలు నిజం ఇదే....

Posted 10 days ago | Category : business

 ఐకీయా వెనక ఉన్న  అసలు  నిజం ఇదే....

జోరుకి బ్రేక్.... నష్టాల్లో స్టాక్ మార్కెట్ల...!

Posted 11 days ago | Category : business

జోరుకి  బ్రేక్.... నష్టాల్లో స్టాక్ మార్కెట్ల...!

ఇండియాలో ఐకియా స్టోర్..... హైదరాబాద్ లో ప్రారంభం!

Posted 12 days ago | Category : state business

ఇండియాలో ఐకియా స్టోర్..... హైదరాబాద్ లో ప్రారంభం!

తెలంగాణ టూరిజం కన్క్లేవ్ 2018.....!

Posted a month ago | Category : business state

తెలంగాణ టూరిజం కన్క్లేవ్ 2018.....!

ముగిసిన మార్కెట్.... లాభాల్లో సెన్సెక్స్‌.... నష్టాల్లో నిఫ్టీ

Posted a month ago | Category : business

ముగిసిన మార్కెట్.... లాభాల్లో సెన్సెక్స్‌.... నష్టాల్లో నిఫ్టీ

స్టాక్‌మార్కెట్‌ జోరు... లాభాల్లో ముగిసిన సెన్సెక్స్

Posted a month ago | Category : business

స్టాక్‌మార్కెట్‌ జోరు... లాభాల్లో ముగిసిన సెన్సెక్స్

ఫ్లిప్‌కార్ట్‌ లో జాబ్స్.......యువత కి చక్కని అవకాశం...!

Posted a month ago | Category : business

ఫ్లిప్‌కార్ట్‌ లో జాబ్స్.......యువత కి చక్కని అవకాశం...!

నాగార్జున యాడ్ ను తొలగించిన కల్యాణ్ జువెల్లర్స్......!

Posted a month ago | Category : movies business

నాగార్జున యాడ్ ను తొలగించిన కల్యాణ్ జువెల్లర్స్......!

టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లు ఇక చౌక ధరకే...!

Posted a month ago | Category : state business

టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లు ఇక చౌక ధరకే...!

జియో మరో ఆఫర్...

Posted a month ago | Category : business

జియో మరో ఆఫర్...

మరో సంచలనానికి జియో సిద్ధం........!

Posted a month ago | Category : national business

మరో సంచలనానికి జియో సిద్ధం........!