ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ఫ్రాన్స్ అధ్యక్షునిగా 'మాక్రాన్' మరో నెపోలియన్ కానున్నారా ?

Posted 7 months ago world editorial

ఫ్రాన్స్ అధ్యక్ష పదవికి ఆదివారం హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఎన్ మార్చె మూవ్‌మెంట్‌కు చెందిన ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ సంచలన విజయం సాధించారు. ఫ్రాన్స్ లో అతిపిన్న వయస్సులో పెను రాజకీయ మార్పులకు కారణం కాగలరని ఊహాగానాలు నెలకొంటున్నాయి.

39 ఏళ్లకే ఎటువంటి రాజకీయ నేపధ్యం లేకుండా, ఎవ్వరి అంచనాలకు అందుకొని రీతిలో విజయం సాధించడంతో అతి పిన్న వయస్సులోనే దేశాధినేతగా మారి ప్రపంచ చరిత్ర పైననే చెరగని ముద్ర వేసిన మరో నెపోలియన్ గా ఆయన మారతారా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన ప్రత్యర్థి, నేషనల్ ఫ్రంట్‌కు చెందిన లీ పెన్ ఓటమి పాలయ్యారు.

ఐరోపాలో ఉదారవాద విధాన రాజకీయాలు ప్రాధాన్యత సంతరింప చేసుకొంటున్న సమయంలో మాక్రాన్ యూరప్, వాణిజ్య అనుకూల మధ్యవాదికాగా, 48 ఏండ్ల లీ పెన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాదిరే వలసల వ్యతిరేకి. పుననిర్మాణం జరిగే ఐరోపా యూనియన్ లో ఫ్రాన్స్ క్రియాశీల పాత్ర వహించాలని ఆయన కోరుకొంటున్నారు ఏప్రిల్ 23న నిర్వహించిన ఎన్నికల్లో ఏ అభ్యర్థికీ మెజారిటీ లభించకపోవడంతో అగ్రస్థానాన నిలిచిన ఈ ఇద్దరి కోసం ఆదివారం తిరిగి ఎన్నికలు జరిపారు. సోషలిస్టు పార్టీకి చెందిన ప్రస్తుత అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేకు మరోసారి ఎన్నికల్లో పోటీచేసే అవకాశమున్నా అందుకు ఆయన నిరాకరించారు. రాజకీయ అనుభవమేమీ లేని మాజీ బ్యాంకర్ అయిన మాక్రాన్ ఇప్పుడు సవాళ్ల నడుమ నిలిచిన దేశానికి అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత పిన్నవయసులో అధ్యక్షస్థానం అలంకరించి సంచలనం సృష్టించిన మాక్రాన్ వ్యక్తిగత జీవితంలోనూ అసాధారణంగా వ్యవహరించారు. తనకన్నా 25 ఏండ్లు పెద్దవారైన, అప్పటికే భర్త, ముగ్గురు పిల్లలున్న బ్రిగిట్టెతో మాక్రాన్ ప్రేమాయణం, పెళ్లి మొదలైనవన్నీ వినటానికి వింతగానే ఉంటాయి.

ఫ్రెంచ్, లాటిన్, ఇంగ్లిష్, డ్రామా పాఠాలు నేర్పించే ఉపాధ్యాయురాలు బ్రిగిట్టె దగ్గరికి మాక్రాన్ వచ్చి స్క్రిప్ట్ రాయటం తనకు నేర్పించమని విజ్ఞప్తి చేశాడు. అప్పుడతడి వయస్సు కేవలం 15 ఏండ్లు. బ్రిగిట్టె వయస్సు 40. అప్పటికే జాక్వెస్ అండ్ హిస్ మాస్టర్ అనే నాటకంలో మాక్రాన్ నటన చూసి ముగ్ధురాలైన బ్రిగిట్టె.. అందుకు అంగీకరించారు. రెండేండ్లలోనే వారి మధ్య అనుబంధం గట్టిపడింది. మాక్రాన్ మేధస్సును చూసి బ్రిగిట్టె ముచ్చటపడేవారు. ఆమె తన పట్ల చూపించే ప్రేమ, అభిమానం, మార్గనిర్దేశకత్వాన్ని చూసి, పెళ్లంటూ చేసుకుంటే ఆమెను చేసుకోవాలని మాక్రాన్ నిర్ణయించుకున్నాడు. నువ్వేమైనా చెయ్యి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటూ 17 ఏండ్ల వయస్సులోనే ఆమెకు చెప్పేశాడు. 2006లో తన భర్త ఆండ్రీలూయిస్ అజీరె నుంచి బ్రిగిట్టె విడిపోయారు. మరుసటి ఏడాది మాక్రాన్‌ను పెళ్లి చేసుకున్నారు.

మాక్రాన్ ఉన్నత విద్యాభ్యాసం చేస్తుంటే, బ్రిగిట్టె ఉపాధ్యాయురాలిగా పని చేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన మాక్రాన్‌కు పూర్తి అండగా నిలిచారు. మాక్రాన్‌తో జీవితం పంచుకుంటున్నా.. మొదటిభర్త ద్వారా పుట్టిన ముగ్గురు పిల్లల కుటుంబాలను, తన కోసం ఎదురుచూసే ఏడుగురు మనుమలు, మనుమరాండ్లను బ్రిగిట్టె తరచూ కలిసి వస్తుంటారు.

Most Read