ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

చంద్రబాబు పర్యటనలో అలజడి కలిగిస్తున్న తెలుగు రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్షాలు పరస్పరం తీవ్ర రాజకీయ వైరుధ్యాలతో విమర్శలకు దిగడం పరిపాటి. ఒక్కరిపై మరొకరు దుర్భాషలకు దిగడం కూడా ఆనవాయితీగా మారింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడులకు ఆకర్షించడం కోసం పది రోజుల పాటు అమెరికాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జరుపుతున్న పర్యటన సందర్భంగా కూడా ఇటువంటి ఆరోపణలు విదేశంలో సైతం చోటుచేసుకోవడం విస్మయం కలిగిస్తుంది. తెలుగు దేశం పార్టీ వర్గాల కధనం ప్రకారం చంద్రబాబు డాలస్ లోని ఇర్వింగ్‌ అనే పట్టణానికి వెళ్లగా అదే సమయంలో ఇర్వింగ్‌ మేయర్‌ బేతవాన్‌ డ్యూన్‌కు కొంతమంది ఈ-మెయిల్స్‌ పంపించారు. ‘‘ఎర్రచందనం స్మగ్లర్ల పేరుతో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో 25 మందిని చంపించారు. ఆయన ఇప్పుడు ముందస్తు అనుమతి లేకుండా అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్రమంగా భారీ ఎత్తున నిధులు సేకరిస్తున్నారు. దీనిపై విచారణ జరిపించండి’’ అని ఇండియన్స్‌ ఫైటింగ్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ పేరిట వారు ఈ-మెయిల్స్‌లో కోరారు.

వీటిని చూడగానే ఇర్వింగ్‌ మేయర్‌ అప్రమత్తమయ్యారు. ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఇర్వింగ్‌ పోలీసులు హుటాహుటిన చంద్రబాబు ప్రవాసాంధ్రులతో సమావేశమైన చోటుకు వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక చూస్తే భారీ సంఖ్యలో హాజరైన ప్రవాసాంధ్రులు, ప్రముఖులతో అంతా కోలాహలంగా ఉంది. ఇది ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధులకు చెందిన సమావేశమని పోలీసులు గ్రహించారు. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి అని, పెట్టుబడులు ఆహ్వానించేందుకు ప్రవాసాంధ్ర ప్రముఖులతోపాటు, అమెరికాకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో అధికారికంగా సమావేశమవుతున్నారని తెలుసుకున్నారు. తమకు వచ్చిన మెయిల్స్‌లో వాస్తవం లేదని అర్థం చేసుకున్నారు.

పరిస్థితి గ్రహించి పోలీస్ లు చంద్రబాబు కు భద్రత కలిపించడంలో మునిగిపోయారు. సాధారణంగా విదేశాల నుండి వచ్చే రాజకీయ నాయకులకు స్థానిక పోలీస్ లు భద్రత కలిపించరు. ఇదంతా వైసీపీ మద్దతుదార్లు చేసినదే అని టిడిపి వర్గాలు వాపోతున్నాయి. ఇలా ఉండగా, టిడిపి వర్గాల కథనాలు నిరాధారమని వైసిపి అమెరికా కన్వీనర్ లు రత్నాకర్ పండుగేయాల, గురవా రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక వైసిపి సభ్యులెవ్వరూ ఇటువంటి పనులు చేయలేదని అంటూ కొన్ని వాస్తవాలను కప్పి పుచ్చడం కోసం ఇటువంటి ప్రచారం చేస్తున్నట్లు వారు అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు మద్దతు దారులు నిర్వహిస్తున్న కొన్ని అవుట్ సోర్స్ కంపెనీలపై అమెరికా సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ శాఖ వారు దాడులు జరిపారని, ఆ వార్త కప్పి పుచ్చడం కోసం ఇటువంటి వదంతులు వ్యాప్తి చేస్తున్నారని వారు విమర్శించారు.

Related Articles

Most Read