ఏపీ లో తెలుగుదేశం ఎమ్మెల్యే పై కోడిగుడ్ల దాడి

Posted a month ago | Category : state

చొక్కాలు మార్చినంత సులువుగా నాయకులు పార్టీలు మార్చుతున్నారు. పాలక పార్టీల ఆకర్షణలో పడి తమను ఎన్నుకున్న ప్రజలను అపహస్యం చేస్తున్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధుల వలసలు తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ప్రజల్లో పెద్ద ఎత్తున్నే అసంతృప్తి గూడు కట్టుకొని ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకే పలు రూపాల్లో నిరసనలు తెలుపుతున్న ప్రజలు...మరో అడుగు ముందుకు వేసి ఏకంగా కోడిగుడ్లు విసిరారు. ఇలా ప్రజల చేతిలో అవమానాల పాలు అయింది ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి - వైసీపీలో గెలిచి టీడీపీలో చేరి అశోక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ పరాభవానికి గురయ్యారు.

గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ పరంగా చేపట్టిన ఇంటింటికీ టీడీపీని అర్ధవీడు మండలం వెలగలపాయ గ్రామంలో చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతుండగా...ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లు విసిరేశారు. దీంతో సభలో కలకలం రేగింది.

ఎమ్మెల్యే లక్ష్యంగా కోడిగుడ్ల దాడి చేసిన ఘటనపై అక్కడ ఉన్న ఎమ్మెల్యే అనుచరులు పలువురిని అనుమానించి వారిపై చేయిచేసుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున కలకలం రేగింది. తమ గ్రామంలో సభ పెట్టి...తమ ఊరి వారినే అనుమానించడం..దాడి చేయడం ఏమిటని గ్రామస్తులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కోడిగుడ్లు విసిరారనే అనుమానంతో సర్పంచి బంధువులు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా పోలీసులను స్థానిక మీడియా ప్రతినిధులు సంప్రదించగా...ఆకతాయిలు ఎవరో మద్యం మత్తులో చేసిన పనిగా భావిస్తున్నామన్నారు. తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు వెల్లడించారు. కాగా ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యే తనపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ పరిణామాన్ని ఎమ్మెల్యే సన్నిహిత వర్గాలు తేలిక చేసి చూపే ప్రయత్నం చేస్తున్నాయి. ఎమ్మెల్యే పై బంతిపూలు అనుకోని చూసుకోకుండా కోడిగుడ్లు విసిరారని విషయాన్ని లైట్ చేసే ప్రయత్నం చేశారు.


హైదరాబాద్ లో సేల్ఫీ విడియో కలకలం !

Posted a few seconds ago | Category : state

హైదరాబాద్ లో సేల్ఫీ విడియో కలకలం !

గజల్ శ్రీనివాస్ కి బెయిల్....కానీ...

Posted an hour ago | Category : state

గజల్ శ్రీనివాస్ కి బెయిల్....కానీ...

బ్రేకింగ్ న్యూస్... తగలబడుతున్న ఖైరతాబాద్ ఆర్టీయే కార్యాలయం

Posted 6 hours ago | Category : state

బ్రేకింగ్ న్యూస్... తగలబడుతున్న ఖైరతాబాద్ ఆర్టీయే కార్యాలయం

శ్రీ చైతన్య, నారాయణలకి షాక్ ఇచ్చిన హైకోర్టు !

Posted 7 hours ago | Category : state

శ్రీ చైతన్య, నారాయణలకి షాక్ ఇచ్చిన హైకోర్టు !

ఫిల్మ్‌నగర్‌ దైవసన్నిధానం చైర్మన్‌గా మోహన్‌బాబు ప్రమాణస్వీకారం..!

Posted 21 hours ago | Category : state

ఫిల్మ్‌నగర్‌ దైవసన్నిధానం చైర్మన్‌గా మోహన్‌బాబు ప్రమాణస్వీకారం..!

జనసేనాధిపతి తో సంపూర్ణేష్ బాబు

Posted a day ago | Category : state

జనసేనాధిపతి తో సంపూర్ణేష్ బాబు

ఎ ఫేస్ బుక్ లవ్ స్టోరీ..!

Posted a day ago | Category : state

ఎ ఫేస్ బుక్ లవ్ స్టోరీ..!

నాకు కేసీఆర్ అంటే ఇష్టం: పవన్ కళ్యాణ్

Posted a day ago | Category : state

నాకు కేసీఆర్ అంటే ఇష్టం: పవన్ కళ్యాణ్

సీమ వదిలి కోస్తాకి వచ్చిన జగన్

Posted a day ago | Category : state

సీమ వదిలి కోస్తాకి వచ్చిన జగన్

థియేటర్స్ ఆదాయానికి గండి కొడుతున్న అమేజాన్ ప్రైమ్..!

Posted 2 days ago | Category : state

థియేటర్స్ ఆదాయానికి గండి కొడుతున్న అమేజాన్ ప్రైమ్..!

పవన్ సతీమణి గురించి షాకింగ్ విషయాలు...!

Posted 2 days ago | Category : state

పవన్ సతీమణి గురించి షాకింగ్ విషయాలు...!