ప్లాస్టిక్ ముప్పును ఎదుర్కొంటున్న భూమి

Posted 7 months ago | Category : world

అదుపుతప్పిన ప్లాస్టిక్ ఉత్పత్తి, విచ్చలవిడి వినియోగం కారణంగా భూమిపెను ముప్పు ఎదుర్కొంటున్నది. 1950 దశకంలో ప్లాస్టిక్ ఉత్పత్తి మొదలు కాగా, 2015 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 830 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అయినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇందులో 630 కోట్ల టన్నులు వ్యర్థాలుగా మారి పర్యావరణంలోకి చేరినట్లు అంచనా. అంటే 76 శాతం ప్లాస్టిక్‌ను బయటపడేశామన్నమాట. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి భూ గ్రహంపై 1200 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ప్లాస్టిక్ వ్యర్థాల సునామీని ఎదుర్కోవాలంటే అత్యవసరంగా ప్రజల ఆలోచనా విధానంలో, ప్రభుత్వాల విధానాల్లో మార్పు రావాలని సూచిస్తున్నారు.  ఇప్పటివరకు మానవులు ఉత్పత్తి చేసిన ప్లాస్టిక్‌లో 76 శాతం వ్యర్థంగా మారి పర్యావరణంలోకి చేరడమే ఇందుకు నిదర్శనం. అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తల బృందం జరిపిన పరిశోధనలో విస్మయం కలిగించే వాస్తవాలు వెల్లడయ్యాయి.

ప్లాస్టిక్ వ్యర్థాలు భూగ్రహం మొత్తం పేరుకుపోయాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సముద్రాలు, నదులు ఇతర జలవనరుల్లో ప్లాస్టిక్ పేరుకుపోవడం వల్ల జలచరాల మనుగడకు ముప్పు వాటిల్లుతున్నది. 2010 నాటికి దాదాపు 80 లక్షల టన్నుల వ్యర్థాలు సముద్రాల్లో కలిశాయని అంచనా. నదులు, ఇతర జలాశయాల్లో కలిసింది అదనం.

ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో 9 శాతం మాత్రమే రీసైకిల్ అవుతున్నది. 12 శాతం వ్యర్థాలను మండించి భస్మం చేస్తుండగా, మిగతా 79 శాతం వ్యర్థాలు వాతావరణంలోకి చేరి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయని పరిశోధకులు స్పష్టం చేశారు.

ప్రపంచం ఎదుర్కొంటున్న ప్లాస్టిక్ సునామీ ముప్పును ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ మారాల్సిందేని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ లేని ప్రపంచాన్ని ఊహించుకోలేం కాబట్టి వినియోగంలో మార్పు రావాలని చెప్తున్నారు. అత్యవసరంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలంటున్నారు. అదేసమయంలో రీసైక్లింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి ఉన్నదని, దీనికి అనుగుణంగా పరిశోధనలు జరుగాలని స్పష్టం చేస్తున్నారు.


టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 2 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 3 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 3 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 3 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 4 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 5 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 5 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 9 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 10 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

Posted 10 days ago | Category : world

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

Posted 10 days ago | Category : world

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!