వైట్ హౌస్ చెత్త అంటున్న అంటున్న డోనాల్డ్ ట్రంప్

Posted 6 months ago | Category : world

ప్రపంచంలోనే గొప్ప అధికార కేంద్రం వైట్ హౌస్ . అమెరికా అధ్యక్ష హోదాలో అందులో నివాసం ఉండటం ఒక గొప్ప వరంగా భావిస్తూ ఉంటారు. అమెరికా అధ్యక్షులం కాకపోయినా కనీసం అందులో ఆతిధ్యం స్వీకరించడం సహితం గొప్ప గౌరవంగా భావిస్తూ ఉంటారు.

అయితే ఎటువంటి రాజకీయ నేపధ్యం లేకుండా అనూహ్యంగా అందులోకి మారిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు మాత్రం అక్కడ ఉండటం పట్ల అసహనంగా ఉంటున్నారు. అదొక్క చెత్త అంటున్నారు. ఓ పేద్ద బిజినెస్ మ్యాన్‌గా స్టార్ హోట‌ల్స్‌లో, ల‌గ్జ‌రీ రిసార్ట్స్‌లో గ‌డిపే అల‌వాటున్న ట్రంప్‌కు వైట్ హౌస్ పెద్ద‌గా న‌చ్చ‌క‌పోవ‌డంలో ఆశ్చ‌ర్య‌మేమీ లేదు.

ఇక్క‌డి వ‌స‌తులు ఫోర్ స్టార్ హోట‌ల్ క‌న్నా త‌క్కువే ఉన్నాయ‌ట‌. ఈ విష‌యాన్ని ట్రంప్ త‌న గోల్ఫ్ మిత్రుల‌తో పంచుకున్న‌ట్లు గోల్ఫ్‌.కామ్ వెబ్‌సైట్ వెల్ల‌డించింది. వైట్ హౌస్ కంటే త‌న ప్రైవేట్ ప్రాప‌ర్టీస్‌లోనే ఉండాల‌నుకునంటున్న‌ట్లు ట్రంప్ చెప్పార‌ట‌. వైట్ హౌస్ ఓ చెత్త అని కూడా ట్రంప్ అన్న‌ట్లు ఈ వెబ్‌సైట్ తెలిపింది.

అయితే ఆయ‌న ఇలా అన్న‌ట్లు వైట్ హౌస్ అధికార ప్ర‌తినిధి మాత్రం ధృవీక‌రించ‌లేద‌ని అదే వెబ్‌సైట్ చెప్పింది. ట్రంప్ కామెంట్స్‌పై సెటైర్ వేసింది మాజీ అధ్య‌క్షుడు బిల్ క్లింట‌న్ కూతురు చెల్సీ క్లింట‌న్‌. ఎనిమిదేళ్లు వైట్ హౌస్ లో ఉన్న‌దామె. ట్రంప్ దాన్నో చెత్త అని అన్న త‌ర్వాత ఆమె ఓ ట్వీట్ చేసింది. వైట్ హౌస్ లో ప‌నిచేస్తున్న సిబ్బంది అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు అని చెల్సీ అన్న‌ది.

ట్రంప్ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత తొలి 26 వీకెండ్స్‌లో 21 వీకెండ్స్‌ను ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్న‌ త‌న ల‌గ్జ‌రీ రిసార్ట్ మారలాగోలోనే గ‌డిపిన‌ట్లు సీఎన్ఎన్ వెల్ల‌డించింది. దీని వెనుక ఇదే కార‌ణం కావ‌చ్చ‌ని తెలుస్తున్న‌ది. అంతేకాదు వైట్ హౌస్ లో తాము ఉండే క్వార్ట‌ర్స్‌లో ప్ర‌త్యేకంగా ఇంటీరియ‌ర్ డిజైన‌ర్‌తో కొన్ని మార్పులు చేర్పులు చేయించారు ట్రంప్‌. గ‌తంలో ఉన్న ఏ అధ్యక్షుడు కూడా ఈ విధంగా చేయకపోవడం గమనార్హం.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 16 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!