జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఇలా చెయ్యండి.

Posted 2 months ago | Category : world

జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా, నల్లగా నిగనిగలాడుతూ కనిపించాలని కోరుకోని అమ్మాయిలుంటారా.. చైనా హువాంగ్లుఓ యావో ప్రాంత అమ్మాయిలకు అదో వరం. ఎనభైఏళ్లు వచ్చినా జుట్టు నెరవదు. పైగా ఒత్తుగా, దాదాపుగా ఏడు అడుగుల వరకూ పెరుగుతుంది. అందుకే వాళ్లు గిన్నిస్‌ రికార్డు కూడా సొంతం చేసుకున్నారు. పులిసిన బియ్యం కడిగిన నీటిని తలకు రాసుకోవడమే తమ రహస్యమని చెప్పేస్తారు. బియ్యం కడిగిన నీటిని ఒక రోజంతా పులియబెట్టి దాన్ని తలకు రాసుకుని కాసేపయ్యాక కడిగేస్తారు. జుట్టు త్వరగా నెరిసేలా చేసే, రాలిపోవడానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను ఈ నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు అడ్డుకుంటాయని నమ్ముతారు.

అంతే కాదు ఆ నీటిలో ఖనిజాలూ ఎక్కువగా ఉంటాయి. జుట్టుకు కావాల్సిన విటమిన్‌ కె కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. కుదుళ్లు గట్టిపడి, జుట్టు ఆరోగ్యంగా మారుతుందని చెబుతారీ అమ్మాయిలు. ఇక, ఇక్కడున్న మరో ప్రత్యేకత ఏంటంటే.. వీళ్లు ఆ జుట్టు ముడి వేసుకునేదాన్ని బట్టి పెళ్లయిందో లేదో కూడా తెలుసుకోవచ్చట. జుట్టంతా పైకి తీసుకొచ్చి చుట్టలా చుడితే.. పెళ్లయిందని అనుకోవాలి. అలా చుట్టుకుని మధ్యలో చిన్న కొప్పులాంటిది పెట్టుకుంటే పిల్లలున్నారని అర్థం. అలా కాకుండా జుట్టుకు ఏదయినా వస్త్రాన్ని చుట్టుకుంటే భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారని అనుకుంటారట.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 16 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!